
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య(Naga Shaurya), ‘పెళ్లి చూపులు’ఫేమ్ రీతూ వర్మ(Ritu Varma) జంటగా నటించిన తాజా చిత్రం ‘వరుడు కావలెను’.లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్‌తో పాటు పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని దగ్గుబాటి రానా విడుదల చేసారు. ఈ సందర్బంగా నిర్మాత సూర్యదేవర నాగవంశి మాట్లాడుతూ ఓ మాట అన్నారు. అదిప్పుడు ట్రేడ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది.
Naga Vamshi చెప్పినదాని ప్రకారం..Varudu Kavalenu సినిమా ట్రైలర్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ని ఫోకస్ చేస్తూ కట్ చేసారు. కానీ సినిమాలో ఓ బ్లాక్ ఉంటుంది. దాన్ని ప్రోమోలో చూపటం లేదు. కానీ సినిమా చూస్తున్నప్పుడు సర్పైజింగ్ గా ఉంటుంది. యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఆ బ్లాక్ సెకండాఫ్ లో వస్తుంది. ఒక్కసారిగా అది రాగానే సినిమా నెక్ట్స్ లెవిల్ కు వెళ్తుంది అని ఆయన హింట్ ఇచ్చారు. `వరుడు కావలెను`కి అది బాగా ప్లస్ అవుతుందని అన్నారు.
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ‘పెళ్లి చూపుల కాన్సెప్టే మా అమ్మాయికి పడదు’ అనిహీరోయిన్ తల్లి చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. పెళ్లి చూపులు కాన్సెప్ట్ అంటేనే ఇష్టంలేని భూమి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు ఆకాశ్. ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆయన ప్రయత్నం ఫలించి.. భూమి ప్రేమను పొందుతాడు. కట్ చేస్తే.. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోతారు. మరి ఆ విభేధాలకు గల కారణాలు ఏంటో తెలియాలంటే.. అక్టోబర్ 29న థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే.
related news: 'వరుడు కావలెను' ట్రైలర్: 'పొగరుబోతులకి ప్రీమియర్ లీగ్ పెడితే ఆవిడే విన్నర్'
రీసెంట్‌గా వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ తరహాలోనే మ్యారేజ్ కాన్సెఫ్ట్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కినట్లుగా ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. పొగరుబోతులకే కనుక ప్రీమియర్ లీగ్ ఉంటే.. ప్రతి సీజన్‌లో ఆవిడే విన్నర్ తెలుసా? వంటి పంచులే కాకుండా.. నా పేరు ఆకాశ్.. భూమికి అన్నివైపులా నేను ఉంటాను అని హీరో అంటే... భూమి, ఆకాశం ఎదురెదురుగా ఉన్నా ఎప్పటికీ కలవలేవ్.. అని హీరోయిన్ చెప్పే డైలాగ్, అలాగే ట్రైలర్ చివరిలో వచ్చే ఒకసారి చదివిన పుస్తకాన్ని మళ్లీ చదివితే కథ మారుతుందా?.. డైలాగ్ సినిమాలోని డెప్త్‌ని తెలియజేస్తున్నాయి. ఓవరాల్‌గా ట్రైలర్ చూస్తుంటే ఓ మంచి ప్రేమకథతో నిండిన ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అయితే తెలుస్తోంది.