బాలసుబ్రహ్మణ్యంకు నెగెటివ్‌ వచ్చిందన్న వార్త అబద్ధం.. క్లారిటీ ఇచ్చిన ఎస్పీ చరణ్‌

By Satish ReddyFirst Published Aug 24, 2020, 12:57 PM IST
Highlights

సోమవారం ఉదయం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగెటివ్‌ అని వచ్చినట్టుగా వార్తలు మీడియాలో హల్‌ చల్‌ చేశాయి. ప్రముఖ ఛానల్స్‌ అన్ని ఈ వార్తలను ప్రసారం చేయటంతో అంతా నిజమే అని భావించారు. కానీ తాజాగా ఎస్పీ చరణ్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు.

ఈ  రోజు ఉదయం నుంచి ఎప్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ రోజు ఆయనకు నిర్వహించిన కరోనా టెస్ట్‌లో నెగెటివ్‌ వచ్చినట్టుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయని. అయితే ఆయన పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని, ఇప్పటికీ ఆయనకు ఎక్మో సపోర్ట్‌తోనే ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టుగా` మీడియాలో వార్తలు వినిపించాయి

ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఎస్పీ  చరణ్ అధికారికంగా వెల్లడించినట్టుగా ప్రచారం జరిగింది. అంతేకాదు ఆయన ఆరోగ్యం కోసం ప్రార్ధలను చేసిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఎస్పీ చరణ్ ఖండించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా టెస్ట్‌ లో నెగెటివ్‌ వచ్చినట్టుగా వచ్చిన వార్తలన్ని పుకార్లని ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఇప్పటికీ ఎస్పీ పరిస్థితి క్రిటికల్‌గానే ఉందని అయితే గత 48 గంటలుగా ఆయన పరిస్థితి స్టేబుల్‌గా ఉండటం కాస్త ఊరట నిచ్చే అంశం అని ఆయన వెల్లడించారు. తాను స్వయంగా వెల్లడించే వరకు పుకార్లను నమ్మవద్దని కోరారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశారు. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యానికి సంబంధించిన  ఏ విషయమైనా ముందుగా తనకే తెలుస్తుందని, తానే స్వయంగా అప్‌డేట్‌ ఇస్తానని, అనవసరంగా పుకార్లను నమ్మవద్దని ఆయన కోరారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు నెగెటివ్ కాదు.. పుకార్లను ఖండించిన ఎస్పీ చరణ్‌ pic.twitter.com/s2oq4BXUiB

click me!