డైరక్టర్ గా 'జబర్దస్త్' కమెడీయన్,హీరో ఎవరంటే....

Surya Prakash   | Asianet News
Published : Aug 24, 2020, 12:30 PM IST
డైరక్టర్ గా  'జబర్దస్త్' కమెడీయన్,హీరో ఎవరంటే....

సారాంశం

కేవలం నటులు మాత్రమే కాదు టెక్నీషియన్స్ కూడా ఇప్పుడు సీన్ లోకి వస్తున్నారు. ఈ క్రమంలో  కామెడీ షోలతో పాపులర్ అయిన కిరాక్ ఆర్పీ దర్శకుడిగా మారారు. తాజాగా ఆయన దరర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసాడు.

'జబర్దస్త్' కామెడీ షోతో ఎందరో నటులు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తన ప్రతిభతో ఇప్పటికే ఇండస్ట్రీలో సత్తా చూపిస్తున్నారు కూడా. కేవలం నటులు మాత్రమే కాదు టెక్నీషియన్స్ కూడా ఇప్పుడు సీన్ లోకి వస్తున్నారు. ఈ క్రమంలో  కామెడీ షోలతో పాపులర్ అయిన కిరాక్ ఆర్పీ దర్శకుడిగా మారారు. తాజాగా ఆయన దరర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసాడు. 

సీనియర్ హీరో జేడీ చక్రవర్తి, ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ప్రధానపాత్రలో సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమా కు సంబందించిన పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి మెగా బ్రదర్ నాగబాబు హాజరయ్యారు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంగా ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ కుదరడంతో దర్శకునిగా ఆడియెన్స్ ముందుకి రావడానికి నిశ్చయించుకున్నాను అని ఆర్పీ అన్నారు. 

ఈ సినిమాలో జే.డి చక్రవర్తి పాత్ర చాలా విలక్షణంగా ఉంటుంది. సాధ్యమైనంత త్వరలో షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా కిరాక్ ఆర్పీ తెలిపారు. జబర్దస్త్ నుంచి అదిరింది వైపు అడుగులు వేసిన ఈయన.. ఇప్పుడు అక్కడ్నుంచి దర్శకుడిగా మారుతున్నాడు.

ఆర్పీ చెప్పిన కథ నచ్చి సినిమా తీయడానికి అరుణాచలం అనే నిర్మాత ముందుకు రావడంతో తాత్కాలికంగా నటనకు విరామం ఇచ్చి స్టోరీ, స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నాడు ఆర్పీ. అసలు తను ఇండస్ట్రీకి వచ్చింది దర్శకుడు కావాలనే అంటూ ముందు నుంచి చెప్తున్నాడు ఈయన. చెప్పినట్లే ఇప్పుడు ఆర్పీ దర్శకుడిగా మారుతున్నాడు. 'జబర్దస్త్' టీమ్ శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?