అమృతను చూసి సింగిల్ లైఫ్ సిద్ధాంతం వదిలేసిన ధరమ్ తేజ్..!

Published : Aug 24, 2020, 12:23 PM ISTUpdated : Aug 24, 2020, 12:32 PM IST
అమృతను చూసి సింగిల్ లైఫ్ సిద్ధాంతం వదిలేసిన ధరమ్ తేజ్..!

సారాంశం

యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ వైదికగా ఓ ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. తన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ మూవీ నుండి సెకండ్ సింగిల్ వస్తున్నట్లు పంచుకున్నారు. 

యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన లేటెస్ట్ మూవీని వినూత్నంగా ప్రచారం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో పోస్టులు వేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. నిన్న ట్విట్టర్ లో ఓ ఆసక్తికర వీడియో పోస్ట్ చేసిన సాయి ధరమ్, నేడు ఓ అప్డేట్ రానున్నట్లు తెలియజేశారు.  సోలో బ్రతుకే సో బెటర్ మూవీ నుండి ఆగస్టు 26న సెకండ్ సింగిల్ విడుదల కానుంది. అదే విషయాన్ని సాయి ధరమ్ నేడు పంచుకున్నాడు. దానితో  పాటు ఓ పోస్టర్ కూడా విడుదల చేయగా  సముద్ర తీరంలో నభా నటేష్ ను ధరమ్ ఫాలో అవుతున్నాడు. 

ఇక 'హే ఇది నేనేనా' ఈ సెకండ్ సింగిల్ బుధవారం ఉదయం 10:00 గంటలకు విడుదల కానుంది. అలాగే సాయి ధరమ్ తన ట్వీట్ లో 'అంత స్ట్రిక్ట్ గా సోలో బ్రతుకు సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్ కి అమృత ని చూసాక ఏమైంది ???' అని కామెంట్ పెట్టారు. దీనితో ఈ చిత్రంలో ధరమ్ పేరు విరాట్ కాగా, నభా అమృతగా కనిపించనుందని అర్థం అవుతుంది. అలాగే సింగిల్ లైఫ్ సో బెటర్ అనుకున్న విరాట్ ఆలోచనను అమృత తన అందంతో మార్చివేసిందని కూడా తెలుస్తుంది. 

ఇక ఈ రొమాంటిక్ జంట లవ్ స్టోరీ ఏమిటో తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే. నూతన దర్శకుడు సుబ్బు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రతిరోజూ పండగే చిత్రంతో భారీ హిట్ అందుకొని సక్సెస్ ట్రాక్ ఎక్కిన ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ మూవీతో దానిని కొనసాగించాలని అనుకుంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?