రేపు ఉదయం బాలు అంత్యక్రియలు: కుటుంబసభ్యుల ఏర్పాట్లు

By Siva KodatiFirst Published Sep 25, 2020, 7:36 PM IST
Highlights

సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం సంగీత అభిమానులను విషాదంలోకి నెట్టేసింది. బాలు పార్థివదేహాన్ని ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో ఎంజీఎం ఆస్పత్రి నుంచి ఆయన కుమారుడు చరణ్ ఇంటికి అశ్రునయనాల మధ్య తరలించారు

సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం సంగీత అభిమానులను విషాదంలోకి నెట్టేసింది. బాలు పార్థివదేహాన్ని ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో ఎంజీఎం ఆస్పత్రి నుంచి ఆయన కుమారుడు చరణ్ ఇంటికి అశ్రునయనాల మధ్య తరలించారు.

సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం నివాసంలో ఏర్పాట్లు చేశారు. బాలును కడసారి చూసేందుకు ఆయన నివాసం వద్దకు ఇప్పటికే అభిమానులు భారీగా చేరుకున్నారు. కరోనా భయాలను సైతం లెక్క చేయకుండా తమ అభిమాన గాయకుడిని చివరి సారి చూసుకోవాలని పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుంటున్నారు.

Also Read:బాలు మరణంతో రజనీ, కమల్‌ కన్నీటి పర్యంతం

మరోవైపు శనివారం  ఉదయం 10.30 గంటల సమయంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తిరువళ్లూరు జిల్లా రెడ్‌హిల్స్‌ సమీపంలోని తామరైపాకంలోని ఫామ్‌హౌస్‌లో బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సుమారు 50 రోజులు మృత్యువుతో పోరాడిన బాలు.. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తుదిశ్వాస విడిచారు. కరోనా వైరస్‌తో పోరాడి గెలిచిన బాలుని ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి.

Also Read:బాలును బలితీసుకుంది ఆ రియాలిటీ షోనేనా?

కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరారు. ఆగస్టు 13న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ రోజు నుంచీ ఆయన ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందారు. 

click me!