వివాదాస్పద సీరియల్ ప్రసారాలు నిలిపివేత

Published : Aug 30, 2017, 04:08 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
వివాదాస్పద సీరియల్ ప్రసారాలు నిలిపివేత

సారాంశం

సీరియల్ బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై ఆన్ లైన్ పిటిషన్ వేస్తే  లక్ష మందికి పైగా సీరియల్ బ్యాన్ చేయాలని కోరడం గమనార్హం .

 

సినిమా నటులుకే కాదు.. సీరియల్ నటులకు కూడా అభిమానులు అధిక సంఖ్యలోనే ఉంటారు. కొన్ని సీరియల్స్.. ఏళ్ల తరబడి కొనసాగుతున్నా.. వాటిని ప్రేక్షకులు మాత్రం అంగీకరిస్తారు. కానీ ఇటీవల  ఓ సీరియల్ విషయంలో మాత్రం వారు అడ్డం తిరిగారు. సీరియల్ బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. సోనీటీవీలో ఇటీవల పెహ్రేదార్ కీ పియా అనే సీరియల్  ప్రారంభమైంది. ఆ సీరియల్ లో కథానాయకుడు పదేళ్ల పిల్లాడు. హీరోయిన్ వచ్చి 18ఏళ్ల యువతి. ఆ పదేళ్ల పిల్లాడు.. యువతిని ప్రేమించి వివాహం చేసుకుంటాడు.

వారి మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఆ పిల్లవాడు.. ఆమె నుదిటిపై కుంకుమ దిద్దటం లాంటి సన్నివేశాలు ఉన్నాయి. పెళ్లి అంటే అర్థం కూడా తెలియని పిల్లవాడు ఓ యువతి ప్రేమ వివాహం చేసుకోవడం పట్ల  సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.

ఆ సీరియల్ చూసి ఇంట్లో పిల్లలు కూడా తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సీరియల్ ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి విన్నపం చేశారు. దీనిపై ఆన్ లైన్ పిటిషన్ వేస్తే  లక్ష మందికి పైగా సీరియల్ బ్యాన్ చేయాలని కోరడం గమనార్హం

.

దీనిపై సోనీ టీవీ స్పందించింది. ప్రేక్షకులు కోరిక మేరకు సీరియల్ ని బ్యాన్ చేశారు.

ఈ నేపథ్యంలో ఇదే బృందంతో, మంచి కథతో త్వరలోనే ప్రేక్షకుల ముందకు వస్తామని సీరియల్ యూనిట్ తెలిపింది. సోనీ బృందం ఒత్తిడి చేయడంతో ప్రసారాలను నిలిపి వేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?