
పూరి జగన్నాథ్ అండ్ బ్యాచ్ తమ సినిమా షూటింగులు ఉన్నంత కాలం అలుపు లేకుండా కష్టపడతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసి తర్వాత పార్టీల్లో రిలాక్స్ అవుతూ ఉంటారు. ‘పైసా వసూల్' విషయంలోనూ అలాంటి పార్టీనే ఇటీవల జరిగింది.
'పైసా వసూల్' అనుకున్న సమయం కంటే సినిమాను 5 వారాల ముందే రిలీజ్ చేస్తుండటం, దాంతో పాటు ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై హైప్ ఓ రేంజిలో వచ్చేసింది. సినిమా సూపర్ హిట్ అనే టాక్ రాటంతో... సంతోషంలో పూరి టీం మాంచి మాస్ మసాలా పార్టీ చేసుకున్నారు.
‘పైసా వసూల్' ఆడియో సక్సెస్ మీట్ ఇటీవల ముగిసిన తర్వాత అదే రోజు రాత్రి పూరి అండ్ బ్యాచ్ చిన్న పార్టీ చేసుకున్నారు. లేట్ నైట్ వరకు సాగిన ఈ పార్టీలో పూరి జగన్నాథ్, చార్మి, సినిమాలోని హీరోయిన్లు పాల్గొన్నారు. సాధారణంగా ఇలాంటి పార్టీలకు దూరంగా ఉండే బాలయ్య కూడా ఈ పార్టీలో జాయిన్ కావడం విశేషం.
పార్టీలో బాలకృష్ణ పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫుల్ గ్లామరస్ గా తయరై పార్టీకి హాజరైన బాలయ్య మొదట్లో సూపర్ గా కనిపించినా... చివరకు ఓ ఫోటోలో విగ్గు లేకుండా కనిపించారు. దీంతో పార్టీ ఏ రేంజ్ లో సాగిందో కదా అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ సాగుతోంది.
పైసా వసూల్ చిత్రం భవ్య క్రియేషన్స్ బానర్‌పై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'పైసా వసూల్'. శ్రియ, కైరా, ముస్కాన్ హీరోయిన్లు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సెప్టెంబర్ 1న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘పైసా వసూల్' చిత్రానికి సెన్సార్ నుండి యూ/ఎ రేటింగ్ వచ్చింది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గ చిత్రంగా సెన్సార్ రేటింగ్ రావడంతో చిత్ర యూనిట్ ఆనందంగా ఉంది. పూరీ కెరీర్ లో పోకిరి తరహాలో పైసా వసూల్ పెద్ద హిట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు.