సొంతంగా అంబులెన్స్ సర్వీస్‌ని ప్రారంభించిన సోనూ సూద్‌..ప్రభుత్వాలు సిగ్గుపడాలి!

Published : Jan 19, 2021, 11:58 AM IST
సొంతంగా అంబులెన్స్ సర్వీస్‌ని ప్రారంభించిన సోనూ సూద్‌..ప్రభుత్వాలు సిగ్గుపడాలి!

సారాంశం

దేశ వ్యాప్తంగా రియల్‌ హీరో అని నిరూపించుకున్న సోనూ సూద్‌ ప్రభుత్వాలకు అతీతంగా ఓ గొప్ప కార్యాన్ని చేపట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అంబులెన్స్ సర్వీస్‌ని ప్రారంభించారు. తెలంగాణ, ఏపీలో అనారోగ్యానికి గురైనా, ప్రమాదాల బారిన పడ్డ వారిని ఆదుకునేందుకు అంబులెన్స్  సర్వీస్‌ని ప్రారంభించారు.

దేశ వ్యాప్తంగా రియల్‌ హీరో అని నిరూపించుకున్న సోనూ సూద్‌ ప్రభుత్వాలకు అతీతంగా ఓ గొప్ప కార్యాన్ని చేపట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అంబులెన్స్ సర్వీస్‌ని ప్రారంభించారు. తెలంగాణ, ఏపీలో అనారోగ్యానికి గురైనా, ప్రమాదాల బారిన పడ్డ వారిని ఆదుకునేందుకు అంబులెన్స్  సర్వీస్‌ని ప్రారంభించారు. `సోనూ సూద్‌ అంబులెన్స్ సర్వీస్‌` పేరుతో దీన్ని మంగళవారం ప్రారంబించారు. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణలో అంబులెన్స్ సర్వీసులు పడకేశాయి. మండలం, గ్రామ స్థాయిలో అసలు అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. హైదరాబాద్‌ వంటి రెండు మూడు నగరాలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వం అంబులెన్స్ సర్వీస్‌ని పట్టించుకోవడం లేదు. దీంతో సకాలంలో ఆసుపత్రికి చేరలేక ఇటీవల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో సోనూ సూద్‌ ఇంతటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయం. దీనిపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. సోనూ సూద్‌ని చూసి ప్రభుత్వాలు సిగ్గుపడాలని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌