సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యుడితో సోనాక్షి సిన్హా వివాహం ?

By telugu teamFirst Published Nov 27, 2021, 7:28 PM IST
Highlights

చాలామంది బాలీవుడ్ హీరోయిన్లకు అంతగా పాపులర్ కాని సెలెబ్రిటీలు బాయ్ ఫ్రెండ్స్ గా వస్తుంటారు. సోనాక్షి సిన్హా విషయంలో కూడా అదే జరిగింది. సోనాక్షి సిన్హా బాలీవుడ్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

చాలామంది బాలీవుడ్ హీరోయిన్లకు అంతగా పాపులర్ కాని సెలెబ్రిటీలు బాయ్ ఫ్రెండ్స్ గా వస్తుంటారు. సోనాక్షి సిన్హా విషయంలో కూడా అదే జరిగింది. సోనాక్షి సిన్హా బాలీవుడ్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లో నటించి మెప్పించింది. దబంగ్ చిత్రం రీసౌండింగ్ హిట్ కావడంతో సోనాక్షి పేరు మారుమోగింది. 

ఇటీవల కొంత కాలంగా Sonakshi Sinha హవా బాలీవుడ్ లో బాగా తగ్గింది. త్వరలో సోనాక్షి పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకే ఆమె కోడలిగా వెళ్ళబోతున్నట్లు బిటౌన్ మీడియా కోడై కూస్తోంది. బంటి సచ్ దేవ్ అనే వ్యక్తిని సోనాక్షి వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సచ్ దేవ్ సెలెబ్రెటీలకు మేనేజర్ గా వ్యవహరిస్తుంటారు. 

స్కూల్ లో ఉన్నప్పుడే తాను సచ్ దేవ్ ప్రేమలో పడ్డట్లు సోనాక్షి గతంలో ఓ ఇంటర్వ్యూలో సోనాక్షి తెలిపింది. యుక్తవయసుకి వచ్చాక అతడితో ఐదేళ్లు డేటింగ్ చేసిందట. ఆ తర్వాత ఇద్దరూ విభేదాలతో విడిపోయారు. మనస్పర్థలు తొలిగిపోవడంతో తిరిగి మళ్ళీ ఒక్కటయ్యారు. 

Also Read: త్రివిక్రమ్ సూటి ప్రశ్నలు, స్పందించిన మంత్రి పేర్ని నాని.. అసలు ట్విస్ట్ ఇదే

త్వరలోనే వీరిద్దరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బంటి సచ్ దేవ్ Salman khan  ఫ్యామిలీకి చెందిన వాడే అని చెప్పాలి. సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ కు సచ్ దేవ్ బావ అవుతాడు. సచ్ దేవ్ సోదరినే సోహైల్ ఖాన్ వివాహం చేసుకున్నాడు. 

Also Read: Rashmika Mandanna: హీట్ పెంచేసిన రష్మిక.. అధరాల అందాలకు సోషల్ మీడియా షేకింగ్

click me!