త్రివిక్రమ్ సూటి ప్రశ్నలు, స్పందించిన మంత్రి పేర్ని నాని.. అసలు ట్విస్ట్ ఇదే

By telugu teamFirst Published Nov 27, 2021, 4:52 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువస్తున్న ఆన్లైన్ టికెటింగ్ విధానం గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. సినిమా టికెట్ ధరల్ని తగ్గిస్తూ సీఎం జగన్ ఆన్లైన్ టికెట్ విధానాన్ని తీసుకురావాలని డిసైడ్ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువస్తున్న ఆన్లైన్ టికెటింగ్ విధానం గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. సినిమా టికెట్ ధరల్ని తగ్గిస్తూ సీఎం జగన్ ఆన్లైన్ టికెట్ విధానాన్ని తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. అలాగే సినిమాలకు బెనిఫిట్ షోలు, అదనపు షోలు కూడా రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానించారు. ఇది టాలీవుడ్ కు ఊహించని షాక్. 

ఈ సమస్యని ఎలా అధికమించాలి అని టాలీవుడ్ పెద్దలంతా ఆలోచనలో పడ్డారు. మెగాస్టార్ Chiranjeevi కూడా టికెట్ ధరలపై, బెనిఫిట్ షోల రద్దుపై ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలి అని సీఎం జగన్ కు సోషల్ మీడియా వేదికగా రిక్వస్ట్ చేశారు. చిరంజీవి వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని ఓ సందర్భంలో స్పందిస్తూ.. చిరంజీవి వ్యాఖ్యలని జగన్ దృష్టికి తీసుకెళతానని అన్నారు. అలాగే Trivikram Srinivas కూడా టికెట్ ధరలపై స్పందించినట్లు పేర్ని నాని తెలిపారు. త్రివిక్రమ్ కామెంట్స్ ని కూడా జగన్ కు తెలియజేస్తానని అన్నారు. 

చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా టికెట్ ధరలు ఒకే విధంగా ఉండాలి అని గతంలో పేర్నినాని వ్యాఖ్యానించారు. ' చిన్న సినిమాకు పెద్ద సినిమాకు ఒకే టికెట్ ధర అన్నట్లుగా.. అన్ని ఆసుపత్రులలో ఒకటే బిల్లు.. అన్ని స్కూల్స్ లో ఒకే విధమైన ఫీజులు కూడా ఉండాలి కదా అని త్రివిక్రమ్ పేరుతో ట్విట్టర్ లో ఓ ట్వీట్ వైరల్ అయింది. ఈ ట్వీట్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ చేశారని పేర్ని నాని భావించారు. అక్కడే పొరపాటు జరిగింది. 

త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఎలాంటి సోషల్ మీడియా ఖాతాలు లేవు. కానీ పేర్ని నాని వ్యాఖ్యలు ఓ దినపత్రికలో వచ్చాయి. దీనితో త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ లాంటి హారిక అండ్ హాసిని సంస్థ.. సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియాలో స్పందించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కి సోషల్ మీడియా ఖాతాలు లేవని స్పష్టం చేశారు. త్రివిక్రమ్ గారి అధికారిక ప్రకటనలు హారిక అండ్ హాసిని, ఫార్చ్యూన్ 4 సినిమా ట్విట్టర్ ఖాతాలలోనే వస్తాయి. త్రివిక్రమ్ పేరుతో, ఫొటోతో ఉన్న ఖాతాలు ఫేక్ అని స్పష్టం చేశారు. 

Also Read: Jacqueline Fernandez: బట్టబయలైన జాక్వెలిన్ బాగోతం.. రూ. 200 కోట్ల ఛీటర్ తో సరసాలు, ఫోటో లీక్

మంత్రి పేర్ని నాని పొరపాటున త్రివిక్రమ్ ట్వీట్ చేసినట్లుగా భావించడంతో హారిక అండ్ హాసిని అధికారికంగా స్పందించాల్సి వచ్చింది. త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి 'భీమ్లా నాయక్' చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. 

Any official statements from garu will only come from &

He doesn't have any social media presence. Please don't believe in any comments made by various profiles bearing his pic/name.

— Haarika & Hassine Creations (@haarikahassine)
click me!