బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున, సోనియా ఎలిమినేషన్, ఈవీక్ మధ్యలో మరోకరు బయటకి

By Mahesh Jujjuri  |  First Published Sep 30, 2024, 12:19 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుండి సోనియా నాల్గవ వారంలో ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండటంతో పాటుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండే అవకాశం ఉంది.


బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి నాలుగో వారం సోనియా బయటకు వెళ్ళిపోయింది. ఈమధ్యలోనే ఎన్నో ట్విస్ట్ లు.. ఊహించని మలుపులు. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఆడియన్స్ ఎదురుచూస్తున్న టైమ్ రానే వచ్చింది. బిగ్ బాస్ ఇంట్లో పూర్తిగా నెగెటీవ్ అనిపించుకున్న సోనియా.. ఎట్టకేలకు బిగ్ బాస్ హౌస్ ను వీడి బయటకు వెళ్ళిపోయింది. ఈమధ్యలోనే ఎన్నో ట్విస్ట్ లు చూపించాడు బిగ్ బాస్. నామినేషన్స్ లో ఉన్న వారిలో చివరిగా ఆదిత్య ఓం, సోనియా మిగిలారు. వీరిలో ఎవరు హౌస్ నుంచి బయటకువెళ్తారు అనేది అందరిలో క్యూరియాసిటీనిపెంచింది. 

Latest Videos

అయితే ఈ ఇద్దరితో పాటు డేంజర్ జోన్ లో ఉన్నమణికంఠను కూడా యాక్టివిటీ రూమ్ కు పిలిచారు నాగ్. ఇక సోనియా, ఆదిత్యలో ఆదిత్య సేఫ్ అయ్యాడు. సోనియా ఎలిమినేట్ అయ్యింది. ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటంటే..హౌస్ అంతా జీరో అని ట్యాగ్ వేసిన మణికంఠ కూడా డేంజర్ జోన లో ఉండటంతో.. హౌస్ ఒపీనియన్ తీసుకున్నాడు నాగర్జున. దాదాపు అందరూ మణింకంఠ హౌస్ లో ఉండాలి అనుకున్నారు. 

నిఖిల్, పృధ్వీ, నైనిక తప్పించి అందరు మణికి సపోర్ట్ చేశారు. దాంతో సోనియా ఎలిమినేట్ అయిపోయి..మణింకఠ సేఫ్ అయ్యాడు. అయితే హౌస్ మణిని డేంజర జోన్ లోకి వేశారు కాబట్టి.. బిగ్ బాస్ చెప్పే వరకూ అతను జైల్ రూమ్ లో ఉండబోతున్నాడు. ఈసీజన్ లో ఫస్ట్ జైల్ లోకి అడుగుపెట్టిన మొదటి కంటెస్టెట్ గా మణికంట నిలిచాడు. 

ఇక ఇక్కడ మరోవిషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈవారం ఓటింగ్ లో మణింకఠ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. కాని హౌస్ లో వాళ్ళ వల్ల అతను డేంజర్ జోన్ లోకి వచ్చాడు. ఇక ఓటింగ్ లో చివరఉన్న సోనియాను మళ్లీ ఇంట్లోకి రావడానికి ఎవరూ ఒప్పుకోలేదు. అందుకే మణికంఠకు ఓటు వేసి.. అతన్ని సపోర్ట్ చేశారు. 

బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో లిమిట్ లెస్ ట్విస్ట్ లు అంటూ నాగార్జున చెపుతుంటే.. ఏం ఉంటాయి లే అనుకున్నారంతా. కాని ఒక్కొక్కటిగా ట్విస్ట్ లు  చూపిస్తూ. షాక్ ఇస్తున్నాడు కింగ్. అందులో భాగండానే ఈ వీక్ లో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోంది. అది కూడా మిడ్ వీక్ లో ఒకరు బయటకువెళ్ళిపోబోతున్నారు. ఈ విషయాన్ని చివరిలో చెప్పి అతి పెద్ద షాక్ ఇచ్చాడు నాగార్జున. 

అంతే కాదు ఈ వీక్ లోనే.. ఏదో ఒక టైమ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండే అవకాశం ఉంది. ఈ విషయాన్ని క్లియర్ గా చెప్పకపోయినా.. చిన్న హిట్ మాత్రం ఇచ్చాడు నాగ్. ఎప్పుడైనా రావచ్చు.. అని అన్నారు. సో నాగార్జున వెళ్తూ.. వెళ్తూ.. ఈ వీక్ లో జరగబోయే అద్భుతాలకు సబంధించిన ఆడియన్స్ ను కన్ ఫ్యూజన్ లో పెట్టి.. వెళ్ళాడు. అటు మిడ్ ఎలిమినేషన్.. ఇటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఈరెండు ఉండబోతున్నాయి. 

ఈ వీక్ మిడ్ లో ఎలిమినేట్ అయ్యే వ్యక్తి సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎంత మంది ఈ వీక్ లో ఎంటర్ అవ్వబోతున్నారు అనేది చూడాలి. ట్విస్ట్ ఇవ్వాలి అనుకుంటే.. ఇద్దరిని కూడా హౌస్ లోకి పంపే అవకాశం కనిపిస్తోంది. కాని చివరి వరకూ బిగ్ బాస్ లీలలు ఎలా ఉంటాయో తెలియదు. 

నాగార్జునను ఇంప్రెస్ చేసిన విష్ణు ప్రియా

బిగ్ బాస్ హౌస్ లో సన్ డే ఫన్ డే చాలా ఎంటర్టైనింగ్ గా జరిగింది. మరీముఖ్యంగా ఈ ఎపిసోడ్ లో విష్ణు ప్రియ హైలెట్ అయ్యిందని చెప్పుకోవచ్చు. పాటలు డాన్స్ లతో నాగార్జున తోపాటు హౌస్ మొత్తాన్ని ఇంప్రెస్ చేసేసింది. మధ్య మధ్యలో పృధ్వీ మీద ప్రేమ కురిపిస్తూ.. ఆడియన్స్ కు, ట్రోలర్స్ కు కావల్సినంత స్టఫ్ ను ఇచ్చేసంది విష్ణుప్రియా. 

ఇక విష్ణు చేసిన డాన్స్ మూమెంట్స్ అద్భుతం అనాలి. నాగార్జున పాటకు అవే స్టెప్స్ వేసింది. దాంతో ఎప్పుడో పాట.. నేనే ఆ స్టెప్ లు మర్చిపోయాను.. విష్ణు నువ్వు గుర్తు పెట్టుకున్నావు. అందుకే నువ్వు కళామతల్లి ముద్దు బిడ్డవు అంటూ నాగార్జున సెటైర్ వేస్తూనే విష్ణును పొగిడారు. ఆమె డాన్స్ లకు అటు ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. 

నిఖిల్‌-పృథ్వీ ఏడుపులు.. 

ఇక నాలుగు వారాలు తమతో ఉండి.. బాగా మనసకు దగ్గరైన వ్యక్తి వెళ్లిపోవడంతో నిఖిల్- పృధ్వీ తట్టుకోలేకపోయారు. సోనియా ఎలిమినేట్ అయ్యింది అని తెలియడంతో పృధ్వీ కన్నీళ్ళు ఆపుకోలేకపోయాడు. సెపరేట్ గా వెళ్లి ఏడ్చేశాడు. ఇక నిఖిల్ వెళ్ళి పృధ్వీని ఓదార్చాడు. వారిమధ్య బంధం అంత స్ట్రాంగ్ అయ్యింది. కాని సోనియా మాత్రం వీళ్లంత ఎమోషకజనల్ కాదు. ఆమె వీళ్ళను ఎమోషనల్ గా వీక్ చేసిందని చెప్పాలి. 

ఇక అటు నిఖిల్ కూడా చాలా సేపు ఏడుపును కంట్రోల్ చేసుకున్నాడు. కాని సోనియాను స్టేజ్ పైన చూసి మాత్రం ఆపుకోలేక పోయాడు. ఏడుస్తూ..మిస్ యు మచ్చా అన్నాడు. అయితే సోనియామాత్రం ఏమాత్రం ఎమోషనల్ గా కనిపించలేదు. స్టే స్ట్రాంగ్ అని నవ్వుతూ చెప్పి వెళ్లిపోయింది. ఈ హౌస్ వరకే ఆమెఆ రిలేషన్ ను కొనసాగించిందా..? కావాలని అలా చేసిందా అనే డౌట్లు ఆడియన్స్ లో మొదలయ్యాయి. 

click me!