పవన్ కళ్యాణ్ వల్ల రాంచరణ్ కి గాయాలు, పిలిచి మరీ కొట్టారు .. అసలేం జరిగిందో తెలుసా..

By tirumala ANFirst Published Sep 29, 2024, 7:41 PM IST
Highlights

ప్రస్తుతం రాంచరణ్ టాలీవుడ్ లో టాప్ హీరోగా, పాన్ ఇండియా హీరోగా రాణిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. రాంచరణ్ తన బాల్యంలో పవన్ కళ్యాణ్ తో సరదాగా గడిపేవారట.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాంచరణ్ మధ్య బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాబాయ్, అబ్బాయి ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. పవన్ కి చరణ్ అన్నా.. చరణ్ కి పవన్ కళ్యాణ్ అన్నా అమితమైన ప్రేమ. చాలా సందర్భాల్లో ఇది బయట పడింది. 

బాల్యంలో బాబాయ్ తో సరదాగా రాంచరణ్ 

ప్రస్తుతం రాంచరణ్ టాలీవుడ్ లో టాప్ హీరోగా, పాన్ ఇండియా హీరోగా రాణిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. రాంచరణ్ తన బాల్యంలో పవన్ కళ్యాణ్ తో సరదాగా గడిపేవారట. చిరుత చిత్రం రిలీజ్ సందర్భంగా రాంచరణ్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మీ చిన్నప్పుడు బాబాయ్ తో ఎలా గడిపారు.. ఎలా అల్లరి చేశారు అని యాంకర్ ప్రశ్నించింది. 

రాంచరణ్ పై కరాటే ప్రాక్టీస్ చేసిన పవన్ 

Latest Videos

దీనికి రాంచరణ్ సమాధానం ఇస్తూ పవన్ కళ్యాణ్ కరాటే, మార్షల్ ఆర్ట్స్ గురించి తెలిపారు.  పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. కరాటేలో ఆయన బ్లాక్ బెల్ట్ కూడా సాధించారు. బాబాయ్ ఇంట్లోనే కరాటే ప్రాక్టీస్ చేసేవారు. అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేసేవారు. కొన్ని సార్లు నన్నుకూడా పిలిచేవారు. నాపై పంచ్ లు, కిక్ లు ఇవ్వడం చేసేవారు. కొన్ని సందర్భాల్లో పంచ్ లు మిస్ అయ్యి బలంగా తగిలేవి ఆ విధంగా గాయపడ్డ సందర్భాలు ఉన్నాయి అని రాంచరణ్ సరదాగా తెలిపారు. వెంటనే పవన్ కళ్యాణ్.. నీకు దెబ్బలు తగిలాయా.. నాకు గుర్తు లేదే అని అనగా.. దెబ్బలు తిన్న వాళ్ళకి గుర్తు ఉంటుంది అంటూ రాంచరణ్ ఫన్నీగా సమాధానం ఇవ్వడం విశేషం. 

త్వరలో గేమ్ ఛేంజర్ రిలీజ్ 

చిరుత చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్ ఇప్పుడు టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ గా అలరిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ కి పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. త్వరలో రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ తో అలరించబోతున్నాడు. ఈ చిత్ర కథ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్ జె సూర్య, నవీన్ చంద్ర ముగ్గురు విలన్ లు గా నటిస్తున్నారట. రాంచరణ్ ఈ చిత్రంలో తండ్రి కొడుకులుగా డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నాడు. అప్పన్న అనే పేరుతో తండ్రిగా.. రామ్ నందన్ అనే పేరుతో కొడుకుగా చరణ్ నటిస్తున్నారు. అప్పన్న పేద ప్రజల బాగు కోసం పార్టీ స్థాపిస్తారు. 

అప్పన్నకి స్నేహితుడుగా ఉన్న శ్రీకాంత్ వెన్ను పోటు పొడిచి పార్టీని లాక్కుంటాడు. శ్రీకాంత్ తనయుడిగా ఎస్ జె సూర్య నటిస్తున్నారట. సూర్య తండ్రిని మించిన రాజకీయ స్వార్థపరుడిగా ఉంటాడు. అధికారం కోసం ఎంతో క్రూరమైన ఎత్తుగడలు వేసి ప్రజలని వేధిస్తుంటాడు. ఈ కథాంశంతో శంకర్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా గేమ్ ఛేంజర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గ్గా నటిస్తోంది. అంజలి, జయరాం, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

రాంచరణ్, బుచ్చిబాబు కాంబోలో భారీ బడ్జెట్ చిత్రం 

మరోవైపు చరణ్.. బుచ్చిబాబు దర్శకత్వంలో చిత్రాన్ని కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. రంగస్థలం లాగా రస్టిక్ నేచర్ తో ఆ చిత్రానికి పది రెట్లు గ్రాండ్ గా అబ్బురపరిచే సన్నివేశాలతో చాలా వైల్డ్ గా ఈ చిత్రం ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే రాంచరణ్ అభిమానులు శంకర్ గేమ్ ఛేంజర్ కన్నా ఎక్కువగా బుచ్చిబాబు చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.మరోవైపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తూనే హరి హర వీరమల్లు చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. అదే విధంగా పవన్.. ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలని కూడా పూర్తి చేయాల్సి ఉంది. 

click me!