బాలయ్య కాళ్లు మొక్కిన ఐశ్వర్యరాయ్.. ఐఫాలో విచిత్ర సంఘటన, వైరల్ అవుతున్న వీడియో..

By Mahesh Jujjuri  |  First Published Sep 29, 2024, 8:36 PM IST

ఎంతో అట్టహాసంగా జరిగాయి ఐఫా అవార్డ్ ఈవెంట్స్. దుబాయ్ లో జరిగిన ఈ ఉత్సవాలలో... ఆశ్చర్యకరమైన సీన్ ఒకటి కనిపించింది. ఇంతకీ అదేంటంటే..? 
 


అబుదాబిలో ఐఫా అవార్డుల  వేడుకు  అట్టహాసంగా జరిగింది.  సెప్టెంబర్ 27 న స్టార్ట్ అయిన ఈ ఉత్సవం.. సెప్టెంబర్ 29తో ముగిసింది. ఇక  ఈ సినిమా పండగ కోసం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు.. బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, మాలీవుడ్ నుంచి కూడా స్టార్లు.. సూపర్ స్టార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్ని ఇండస్ట్రీల నుంచి పెద్ద వారిని సత్కరించారు. 

ఇక టాలీవుడ్ నుంచి మన మెగాస్టార్ చిరంజీవిని అవుట్ స్టాండింగ్ అఛీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు ఐఫా టీమ్. అటు బాలయ్య ను కూడా గోల్డెన్ లెగసీ అవార్డును ప్రదానం చేశారు. ఈక్రమంలో వేడుకల ప్రాంగణం అంతా.. తారులు దిగివచ్చిన వేళా అన్నట్టుగా కళకళలాడిపోయింది. ఈక్రమంలోనే అక్కడ ఓ అద్భుతం చోటు చేసుకుంది. అదేంటంటే.. 

బాలయ్య కాళ్లకు ఐషు నమస్కారం

Latest Videos

ఈ వేడుకల్లో మాజీ మిస్ యూనివర్స్  అందాల తార ఐశ్వర్యరాయ్ కూడా సందడి చేశారు. ఆమెకు తమిళంలో ఉత్తమ నటి అవార్డు వచ్చింది.  మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ 2 సినిమాలో ఐశ్వర్యరాయ్ నటనకు  ఈ అవార్డు వరించింది. కాగా ఈ పురస్కారాన్ని నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ప్రధానం చేశారు. ఈ టైమ్ లోనే ఇంట్రెస్టింగ్ విజ్యువల్ అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురి చేసింది. 

 ఈ అవార్డును బాలకృష్ణ తన చేతులమీదుగా ఐశ్వర్య కి ప్రదానం చేయాలని ఐఫా నిర్వాహకులు కోరారు. దీంతో అవార్డు అందుకునేందుకు స్టేజీమీదకు వచ్చిన ఐశ్వర్య అవార్డు తీసుకోవడానికి ముందు బాలయ్య కాళ్లకు నమస్కరించింది. ప్రపంచం మెచ్చిన స్టార్ హీరోయిన్ అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి ఆశీర్వాదం తీసుకుంది. ఆ తర్వాతే బాలయ్య చేతుల మీదుగా అవార్డు అందుకుంది. 

 

Bollywood Queen Aishwarya Rai respect towards ❤️😍👌

Aishwarya Rai receives the Best Actress (Tamil) Award from garu at 👏👌 pic.twitter.com/XBjgL48FYu

— manabalayya.com (@manabalayya)

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతే కాదు ఈ వీడియో చూసిన బాలయ్య అభిమానులు అది మా బాలయ్య అంటే అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. ఈ అవార్డుల వేడుకలో సూటు బూటులో బాలకృష్ణ మెరుపులు మెరిపించారు. 

ఐశ్వర్యరాయ్ కు టాలీవుడ్ నచ్చదా..? 

ఈసందర్భంగా ఓ విషయం ప్రస్తతం హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి ఐశ్వర్యరాయ్ కి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే నచ్చదని మొదటి నుంచి టాక్ ఉంది. ఎందుకో తెలియదు.. ఆమె డబ్బింగ్ సినిమాల ద్వారా మాత్రంమే టాలీవుడ్ లో పాపులర్ అయ్యింది. తెలుగు నుంచి ఎన్ని ఆఫర్లు వెళ్లినా.. ఏదో ఒక కారణంతో రిజెక్ట్ చేస్తుందట. ఐశ్వర్య. రీసెంట్ గా చిరంజీవి సినిమా కోసం కూడా ఆమెను సంప్రదించగా.. నో చెప్పినట్టు సమాచారం.  

ఇక కోలీవుడ్ అంటే మాత్రం ఐశ్వర్యకు అమితమైన ప్రేమ. తమిళ పరిశ్రమ నుంచి ఆఫర్ వస్తే.. కథ కూడా సరిగ్గా చూడకుండా ఓకే చేస్తుందట. ఐశ్వర్య రాయ్. ఈబ్యూటీ కన్నడ పరిశ్రమకు చెందినది. అయితే ఆమె తమిళ సినిమా ద్వారానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడే సూపర్ హిట్లు చేసింది. దాంతో ఆమెకు కోలీవుడ్ అంటే అపారమైన గౌరవం. మణిరత్నం సినిమాలు ఆమెకు చాలా ఇష్టం అని తెలుస్తోంది. 

ఇక తెలుగు పరిశ్రమ అంటే ఎందుకు అంత అయిస్టత అనేది మాత్రం తెలియదు. మొదటి నుంచి బాలీవుడ్ కు తెలుగు హీరోలు అన్నా.. తెలుగు సినిమాలు అన్నా ఇష్టం ఉండదు. చాలా చిన్నతనంగా చూసేవారు మనసినిమాలను. సినిమా అంటే వాళ్ళదే అన్నట్టుగా బిహేవ్  చేసేవారు. కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పాన్ ఇండియా సినిమాలు.. ఆస్కార్ రేంజ్ సినిమాలతో టాలీవుడ్ బాలీవుడ్ ను ఎప్పుడో దాటేసింది. పాతాళానికి తొక్కేసింది. 

ఇక ఇప్పుడు టాలీవుడ్ సినిమాలలో నటించడానికి పోటీపడి మరీ వస్తున్నారు బాలీవుడ్ స్టార్స్. ఈక్రమంలో సౌత్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి.. మన టాలీవుడ్ సినిమాలంటే ఐశ్వర్యా రాయ్ కు ఎందుకు అంత కోపమో మాత్రం తెలియదు. 

బచ్చన్ ఫ్యామిలీకి ఐశ్వర్య రాయ్ దూరం.. 

 ఐశ్వర్యరాయ్ గత కొంత కాలంగా వ్యాక్తిగత జీవితం విషయంలో వైరల్ అవుతున్నారు. ఆమె తన భర్త అభిషేక్ తో మనస్పర్ధలు కారణంగా దూరంగా ఉంటున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.  ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ లు త్వరలో విడాకులు తీసుకోనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై అటు ఐష్ కానీ, అభిషేక్ కానీ స్పందించడం లేదు. 

అంతే కాదు ఏ పార్టీకి అయినా.. ఇద్దరు కలిసి వెళ్ళేవారు. కాని గత కొంత కాలంగా ఎక్కడికి వెళ్ళినా.. ఐశ్వర్య రాయ్ తన కూతురుతో మాత్రమే వెళ్తుంది. ఇప్పుడు ప్రతిష్ఠాత్మక ఐఫా అవార్డ్స్ 2024 కోసం కూడా ఐశ్వర్య రాయ్ తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి అబుదాబి వచ్చింది. కొన్ని రోజుల క్రితమే దుబాయ్ లో జరిగిన సైమా వేడుకలకు కూడా కూతురితో కలిసి హాజరైంది ఐశ్వర్యా రాయ్. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. కాని తన భర్త మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. దాంతో వీరి విడాకులు ఫిక్స్ అయినట్టే అనుకుంటున్నారు. 

click me!