డైరెక్టర్ తో ఎఫైర్.. రెండో పెళ్ళికి రెడీ అవుతున్న 7/G బృందావన కాలనీ హీరోయిన్ ?

pratap reddy   | Asianet News
Published : Dec 08, 2021, 07:02 PM ISTUpdated : Dec 08, 2021, 07:03 PM IST
డైరెక్టర్ తో ఎఫైర్.. రెండో పెళ్ళికి రెడీ అవుతున్న 7/G బృందావన కాలనీ హీరోయిన్ ?

సారాంశం

7/G బృందావన కాలనీ చిత్రంలో నటించిన హీరోయిన్ సోనియా అగర్వాల్ ని యువత అంత సులభంగా మరచిపోలేరు. అంతలా ఆ చిత్రంతో సోనియా ప్రేక్షకులకు చేరువైంది.

7/G బృందావన కాలనీ చిత్రంలో నటించిన హీరోయిన్ సోనియా అగర్వాల్ ని యువత అంత సులభంగా మరచిపోలేరు. అంతలా ఆ చిత్రంతో సోనియా ప్రేక్షకులకు చేరువైంది. బోల్డ్ గా, ఎమోషనల్ గా నటించి మెప్పించింది. సోనియా అగర్వాల్ తెలుగులో 'నీ ప్రేమకై' అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం 7/G బృందావన కాలనీ చిత్రమే.

ఆ తర్వాత Sonia Agarwal క్యారెక్టర్ రోల్స్ కి మాత్రమే పరిమితం అయింది. తనకు ఫేమ్ తీసుకువచ్చిన 7/G బృందావన కాలనీ చిత్ర దర్శకుడు సెల్వరాఘవన్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. 2006లో వీరిద్దరూ వివాహం చేసుకోగా.. 2010లో మనస్పర్థల కారణంగా విడిపోయారు. అప్పటి నుంచి సోనియా సింగిల్ గానే ఉంటోంది. సెల్వరాఘవన్ మాత్రం గీతాంజలి అనే మహిళని రెండో వివాహం చేసుకున్నారు. 

ప్రస్తుతం సోనియా అగర్వాల్ రెండో వివాహానికి రెడీ అవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓ దర్శకుడితో సోనియా ఎఫైర్ సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ దర్శకుడిని ఆమె త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. గతంలో కూడా సోనియా అగర్వాల్ రెండో వివాహం గురించి వార్తలు వచ్చాయి. తాజాగా అలాంటి వార్తలే వైరల్ అవుతున్నాయి. అయితే ఈ న్యూస్ పై సోనియా స్పందించలేదు. 

సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా సోనియా టెంపర్, విన్నర్, రెడ్ లాంటి తెలుగు చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం ఆమె నటించిన 'గ్రాండ్ మా ' రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా సోనియా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. బృందావన కాలనీ చిత్రంలో సోనియా బోల్డ్ రొమాన్స్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. 

Also Read: ఇషా గుప్తా అందాల బ్లాస్టింగ్.. నెవర్ బిఫోర్ అనిపించేలా క్లీవేజ్ షో

PREV
click me!

Recommended Stories

Ramya Krishnan రహస్యం వెల్లడించిన రజినీకాంత్, నీలాంబరి పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా?
400 సినిమాల రికార్డు, 100 కోట్లకుపైగా ఆస్తి, 3 పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ యాక్టర్ ఎవరో తెలుసా?