అకిరాలో మరో ట్యాలెంట్.. తల్లికి ఎప్పటికీ గుర్తుండి పోయే బహుమతి, పొంగిపోతున్న రేణు దేశాయ్

pratap reddy   | Asianet News
Published : Dec 08, 2021, 05:16 PM IST
అకిరాలో మరో ట్యాలెంట్.. తల్లికి ఎప్పటికీ గుర్తుండి పోయే బహుమతి, పొంగిపోతున్న రేణు దేశాయ్

సారాంశం

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల ముద్దుల కుమారుడు అకిరా నందన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారుతున్నాడు. తరచుగా మెగా ఫ్యామిలీ వేడుకల్లో అకిరా కనిపిస్తూ సోషల్ మీడియా ట్రెండింగ్ లో నిలిస్తున్నాడు. తల్లితో కలసి అకిరా పుణేలో ఉంటున్న సంగతి తెలిసిందే. 

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల ముద్దుల కుమారుడు అకిరా నందన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారుతున్నాడు. తరచుగా మెగా ఫ్యామిలీ వేడుకల్లో అకిరా కనిపిస్తూ సోషల్ మీడియా ట్రెండింగ్ లో నిలిస్తున్నాడు. తల్లితో కలసి అకిరా పుణేలో ఉంటున్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడూ హైదరాబాద్ వచ్చి వెళుతుంటాడు. ఇక అకీరాకు తన తల్లి అంటే అమితమైన ప్రేమ. 

ఇటీవల Renu Desai తన 40 వ జన్మదిన వేడుక జరుపుకుంది. ఈ సందర్భంగా Akira Nandan తన తల్లికి ఎప్పటికీ గుర్తుండిపోయే బహుమతి అందించాడు. అకిరా ఇచ్చిన బర్త్ డే కానుకకు రేణు దేశాయ్ మురిసిపోతోంది. అకిరా ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ గురించి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. 

ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నా ఫేవరిట్ సాంగ్ నేర్చుకోమని అకీరాకి నెల క్రితం చెప్పాను. ఆ సాంగ్ ని అకిరా నా బర్త్ డే రోజున ఫియానోలో వినిపించాడు. ఇది నాకు బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ అని రేణు దేశాయ్ కామెంట్ పెట్టింది. అకిరా పియానో వాయిస్తున్న వీడియో పోస్ట్ చేసింది. ఇంతకీ రేణు దేశాయ్ కి ఇష్టమైన ఆ పాట.. అకిరా పియానోలో వినిపించిన పాట ఏంటంటే 'ఉరికే చిలుకా వేచి ఉంటాను కడవరకు'. 

 

మణిరత్నం 'బొంబాయి' చిత్రంలోని ఈ పాట. ఈ సాంగ్ ఆల్ టైం సూపర్ హిట్స్ లో ఒకటి. ఈపాటని అకిరా పియానోలో వాయించి వినిపించాడు. ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు అకిరా. ఇప్పుడు పియానో వాయిస్తూ సంగీతంలో కూడా తన ప్రతిభ చాటుకుంటున్నాడు. 

అకిరా టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటి కప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. అకిరా ఆరడుగులు మించిన కటౌట్ తో అభిమానులని ఆకర్షిస్తున్నాడు. ఇప్పటికే మెగా ఫ్యాన్స్ అకిరాని జూనియర్ పవర్ స్టార్ అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. 

Also Read: త్రివిక్రమ్ నన్నెప్పుడూ అలాగే చూస్తారు.. అవకాశాల కోసం అడుక్కోను, నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Richest Music Directors: ఇండియాలో టాప్ 5 రిచెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరో తెలుసా?
Shruti Haasan: కమల్ హాసన్ కూతురు రజినీకాంత్ కు అభిమాని ఎలా అయింది? అసలు విషయం ఏంటంటే?