త్రివిక్రమ్ నన్నెప్పుడూ అలాగే చూస్తారు.. అవకాశాల కోసం అడుక్కోను, నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్

pratap reddy   | Asianet News
Published : Dec 08, 2021, 03:49 PM ISTUpdated : Dec 08, 2021, 03:51 PM IST
త్రివిక్రమ్ నన్నెప్పుడూ అలాగే చూస్తారు.. అవకాశాల కోసం అడుక్కోను, నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్

సారాంశం

సౌత్ లో ప్రస్తుతం ఉన్న నటీమణులలో నటన పరంగా Nitya Menen టాప్ లీగ్ లో ఉంటుంది. కళ్ళతోనే హావభావాలు పలికించే నటీమణులు చాలా అరుదు. ఆ అద్భుతమైన ప్రతిభ నిత్యామీనన్ సొంతం.

సౌత్ లో ప్రస్తుతం ఉన్న నటీమణులలో నటన పరంగా Nitya Menen టాప్ లీగ్ లో ఉంటుంది. కళ్ళతోనే హావభావాలు పలికించే నటీమణులు చాలా అరుదు. ఆ అద్భుతమైన ప్రతిభ నిత్యామీనన్ సొంతం. నిత్యామీనన్ నుంచి దర్శకులు ఎలాంటి ఎమోషన్ అయినా రాబట్టుకోవచ్చు. ఇక నిత్యామీనన్ కూడా సినిమాల ఎంపిక విషయంలో సెలెక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా నిత్యామీనన్ స్కై ల్యాబ్ చిత్రంలో నటించింది. ప్రస్తుతం నిత్యా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన భీమ్లా నాయక్ చిత్రంలో నటిస్తోంది. 

ఈ చిత్రం గురించి మాట్లాడుతూ నిత్యామీనన్ Trivikram Srinivasపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేనెప్పుడూ ఎవరినీ అవకాశాల కోసం అడుక్కోను. ఆ పాత్రను నేను మాత్రమే సరిపోతాను అని నమ్మితే నా దగ్గరకు వచ్చి అడుగుతారు. భీమ్లా నాయక్ చిత్రంలో ఛాన్స్ కూడా అలా వచ్చిందే. త్రివిక్రమ్ తో ముందు నుంచి పరిచయం ఉంది. ఆయనకు నేనెప్పుడూ ఒక రౌడీ అమ్మాయిలాగే కనిపిస్తాను. అందుకే సన్నాఫ్ సత్యమూర్తి లో అలాంటి రోల్ ఇచ్చారు. 

ఇప్పుడు భీమ్లా నాయక్ లో కూడా నేను రౌడీ అమ్మాయి లాగే కనిపిస్తాను. అయ్యప్పన్ కోషియంలో ఈ పాత్రకు అంత ప్రాధాన్యత ఉండదు. కానీ భీమ్లా నాయక్ లో నా రోల్ పెంచారు. కథలో కూడా ప్రాధాన్యత ఉంటుంది.అందుకే అంగీకరించినట్లు నిత్యా మీనన్ పేర్కొంది. 

నిత్యా మీనన్ తొలిసారి Pawan Kalyan కి జోడిగా నటిస్తుండడంతో ఆసక్తి నెలకొంది. జనవరి 12న ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. సంక్రాంతి బరిలో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లాంటి చిత్రాలు ఉన్నప్పటికీ భీమ్లా నాయక్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రానా డానియల్ శేఖర్ గా కనిపించబోతున్నాడు. తమన్ స్వరపరిచిన పాటలు విడుదలై యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రానికి నిర్మాత. 

Also Read: Varshini:నడుము చూడాలా నాభి చూడాలా?...టూ పీస్ స్కర్ట్ లో బోల్డ్ లుక్స్ తో మైండ్ బ్లాక్ చేసిన బోల్డ్ యాంకర్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: దీపను తప్పుపట్టిన కాంచన- అత్తా, కోడళ్ల మధ్య దూరం పెరగనుందా?
Akhanda 2 : బాలయ్య అభిమానులకు భారీ షాక్, ఆగిపోయిన అఖండ2 రిలీజ్ , కారణం ఏంటంటే?