'అరవింద సమేత' ఫంక్షన్ లో స్పెషాలిటీ అదే!

Published : Sep 25, 2018, 10:49 AM ISTUpdated : Sep 25, 2018, 12:53 PM IST
'అరవింద సమేత' ఫంక్షన్ లో స్పెషాలిటీ అదే!

సారాంశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'అరవింద సమేత'. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మరికొద్ది రోజుల్లో పనులన్నీ పూర్తి చేసి దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'అరవింద సమేత'. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మరికొద్ది రోజుల్లో పనులన్నీ పూర్తి చేసి దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సరైన ప్రమోషన్స్ జరగలేదు.

ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణం, షూటింగ్ పూర్తి చేయడానికి తక్కువ రోజులే ఉన్న కారణంగా చిత్రబృందం ప్రమోషన్స్ మీద పెద్దగా దృష్టి పెట్టలేకపోయింది. అయినప్పటికీ ఇప్పటికే సినిమాపై కావాల్సినంత హైప్ వచ్చేసిందనుకోండి. ఇక సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని మాత్రం చాలా గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది చిత్రబృందం. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి చేయనంత గ్రాండ్ గా ఈ ఈవెంట్ ఉండబోతుంది.

 ఇక్కడ మరో స్పెషాలిటీని జోడించాలని చూస్తోంది చిత్రబృందం. ఇలాంటి ఈవెంట్స్ కి యాంకరింగ్ కామన్. అయితే ఇక్కడ యాంకర్ పార్ట్ కాస్త తగ్గించి దర్శకుడు త్రివిక్రమ్, హీరో ఎన్టీఆర్ లు కీలక పాత్ర పోషించే విధంగా ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందనే చర్చలు జరుగుతున్నాయి. నిజానికి ఏదైనా కార్యక్రమాల్లో త్రివిక్రమ్ తన స్పీచ్ మొదలుపెడితే ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా వింటుంటారు.

దీంతో త్రివిక్రమ్ అరవింద సమేత ఫంక్షన్ లో యాక్టివ్ రోల్ తీసుకుంటే బాగుంటుందనేది నిర్మాతల ఆలోచన. ఎన్టీఆర్ కూడా హుషారుగానే మాట్లాడతారు కాబట్టి వీరిద్దరినీ మరింత హైలైట్ చేస్తే.. కార్యక్రమం పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు.   

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి