సీనియర్ తో కౌశల్ ప్రేమకథ.. రక్తంతో లవ్ లెటర్!

Published : Sep 25, 2018, 10:09 AM ISTUpdated : Sep 25, 2018, 10:11 AM IST
సీనియర్ తో కౌశల్  ప్రేమకథ.. రక్తంతో లవ్ లెటర్!

సారాంశం

బిగ్ బాస్ హౌస్ లో ఒకరంటే ఒకరికి పడని కౌశల్, తనీష్ లు పక్కపక్కనే కూర్చొని తమ పాత ప్రేమ కథల గురించి చర్చించుకున్నారు. తనీష్. మీ లైఫ్ లో లవ్ స్టోరీలు లేవా..? అంటూ కౌశల్ ని అడగగా.. కౌశల్ తన ప్రేమ కథను చెప్పుకొచ్చాడు

బిగ్ బాస్ హౌస్ లో ఒకరంటే ఒకరికి పడని కౌశల్, తనీష్ లు పక్కపక్కనే కూర్చొని తమ పాత ప్రేమ కథల గురించి చర్చించుకున్నారు. తనీష్. మీ లైఫ్ లో లవ్ స్టోరీలు లేవా..? అంటూ కౌశల్ ని అడగగా.. కౌశల్ తన ప్రేమ కథను చెప్పుకొచ్చాడు.

''నేను ఇంటర్ లో ఉండగా.. ఓ అమ్మాయికి ప్రపోజ్ చేశాను. ఆ అమ్మాయికి నా క్లాస్ మేట్స్ తో పాటు సీనియర్ కూడా చాలా మంది ట్రై చేసేవారు. కానీ ఆమె ఎవరికీ పడలేదు. నాకు కూడా ఆ అమ్మాయికి ట్రై చేయాలనిపించి రక్తంతో లెటర్ రాసి ఆమెకు ఇచ్చాను. ఆ లెటర్ చూసిన అమ్మాయి ఎమోషనల్ అయ్యి నా ప్రేమను అంగీకరించింది.

దాంతో మా సీనియర్ వచ్చి నన్ను అడిగాడు.. ఎంత ట్రై చేసినా.. పడని అమ్మాయి నీకెలా పడిందని అడిగాడు. నిజానికి నేను నా రక్తంతో లవ్ లెటర్ రాయలేదు. మా ఇంటి పక్కన కోళ్లఫారం ఉండేది.

రోజు అక్కడ కోళ్లను కోసి రక్తాన్ని ఓ గిన్నెలో పట్టేవారు. వాళ్ల దగ్గరకి వెళ్లి కొంచెం రక్తాన్ని తెచ్చుకొని ఆ కోడి రక్తంతో నాలుగు పేజీల లెటర్ రాసి అమ్మాయికి ఇచ్చి ప్రపోజ్ చేశాను'' అంటూ తన ప్రేమ కథను చెప్పుకొచ్చారు. అదీ కౌశల్ కోడిరక్తం ప్రేమ కథ.  

PREV
click me!

Recommended Stories

భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం