భార్య వాట్సాప్ నంబర్ షేర్ చేసిన హీరో!

Published : Sep 25, 2018, 10:27 AM IST
భార్య వాట్సాప్ నంబర్ షేర్ చేసిన హీరో!

సారాంశం

బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తన భార్య కాజోల్ ఫోన్ నెంబర్ ని ట్విట్టర్ లో పెట్టేశాడు. కాజోల్ దేశంలో లేదు.. ఆమెతో ఈ నంబర్ ద్వారా వాట్సాప్ లో కోఆర్డినేట్ చేసుకోండని అజయ్ దేవగన్.. కాజోల్ నెంబర్ ని ట్వీట్ చేశాడు.

బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తన భార్య కాజోల్ ఫోన్ నెంబర్ ని ట్విట్టర్ లో పెట్టేశాడు. కాజోల్ దేశంలో లేదు.. ఆమెతో ఈ నంబర్ ద్వారా వాట్సాప్ లో కోఆర్డినేట్ చేసుకోండని అజయ్ దేవగన్.. కాజోల్ నెంబర్ ని ట్వీట్ చేశాడు.

ఆయన ఎందుకు ఇలా చేశారో అర్ధం కాలేదు కానీ కొద్ది సెకన్లలో ట్వీట్ వైరల్ అయిపోయింది. అభిమానులు ఆమెకి మెసేజ్ పెట్టి ఆ స్క్రీన్ షాట్లను పోస్ట్ చేస్తూ.. 'రిప్లయ్ కోసం ఎదురుచూస్తున్నాం సార్' అంటూ అజయ్ దేవగన్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

ఆ నంబర్ కి ఫోన్ చేస్తే.. కాల్ ఫార్వార్డ్ అని వచ్చిందని కొందరు.. వాట్సాప్ లో పలకరిస్తే ఆమె మెసేజ్ రిసీవ్ చేసుకోలేదని మరికొందరు పోస్ట్ లు పెడుతున్నారు. మరొకొందరితే 'నేను కాల్ చేశాను అయితే కాజోల్ మాట్లాడను, వాట్సాప్ చేస్తానందని ఫోజులు కొడుతున్నారు.

మరికొందరు కాజోల్ మేడమ్ మీ నంబర్ దేవగన్ సర్ ట్వీట్ చేశారు.. వెంటనే వాట్సాప్ అకౌంట్ తొలగించండి అంటూ సలహాలు ఇస్తున్నారు. అసలు అజయ్ కావాలనే ఈ ట్వీట్ చేశారా..? లేక ఆయన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందా..? అనే విషయాలు తెలియాల్సివున్నాయి!

 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?