
మాస్ మహారాజ్, టాలీవుడ్ క్రేజీ హీరో రవితేజ (Ravi Teja) బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూనే ఉన్నారు. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా సినిమా తర్వాత సినిమాను విడుదల చేస్తూ తన అభిమానులకు, ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నారు. ఇటీవల ‘రామారావు ఆన్ డ్యూటీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవిజతే ప్రస్తుతం మరో నాలుగైదు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ‘ధమాకా’ (Dhamaka) మూవీ నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ అందింది.
రవితేజ లైనప్ లో ఉన్న తాజా ప్రాజెక్టుల్లో ‘ధమాకా’ చిత్రం ఒకటి. దర్శకుడు త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా లో పెళ్లి సందD హీరోయిన్, యంగ్ బ్యూటీ శ్రీలీలా (Sree leela) హీరోయిన్‌గా నటిస్తోంది. యాక్షన్ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే పలు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. షూటింగ్ ను శరవేగంగా కొనసాగిస్తోంది. తాజాగా మాస్ మహారాజ అభిమానులను ఖుషీ చేసేందుకు మేకర్స్ కొత్త అప్ డేట్ వదిలారు. చిత్ర గ్లింమ్స్ ను రేపు (ఆగస్టు 31న) సాయంత్రం 5:31కి విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. దీంతో రవితేజ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇఫ్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు, పాటలకు ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ‘రామారావు ఆన్ డ్యూటీ’కి మిశ్రమ స్పందన రావడంతో ఈ చిత్రంతో సాలిడ్ హిట్ పడనుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిబొల్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.