
ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లముడి డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). గతేడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం ఆయా కారణాలతో కాస్తా ఆలస్యం అవుతూ వచ్చింది. పవన్ పొలిటికల్ షెడ్యూల్, చిత్ర నిర్మాణంలో ఏర్పడిన సమస్యలతో షూటింగ్ ఆగుతూ వచ్చింది. మళ్లీ సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (Pawan kalyan Birthday) కావడంతో అభిమానులు సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు.
పవన్ స్టార్ బర్త్ డే సందర్భంగా ‘హరి హర వీరమల్లు’ చిత్ర యూనిట్ కూడా అభిమానులకు సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. చాలా రోజులుగా ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే మూవీ షూటింగ్ అయినా పూర్తి అవుతుందా లేదా? అనే అనుమానాల మధ్య ఫ్యాన్స్ కాస్తా నిరాశకు లోనయ్యారు. ఇటవల నిర్మాత కూడా చిత్ర షూటింగ్ కొనసాగుతుందని చెప్పడంతో అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ క్రమంలో పవన్ పుట్టిన రోజు సందర్భంగా ‘హరి హర వీరమల్లు’ నుంచి డబుల్ ట్రీట్ గా అదిరిపోయే పోస్టర్ మరియు గ్లింప్స్ ను వదలబోతున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈ అప్డేట్ వస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి.
మరోవైపు సెప్టెంబర్ ఒకటిన పవన్ బర్త్ డే సందర్భంగా ‘జల్సా’ 4కే వెర్షన్ ను రీరిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల్లో థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొననుంది. ఇప్పటికే థియేటర్లలో ఆన్ లైన్ బుక్కింగ్స్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్ లోనూ ‘జల్సా’ చిత్రాన్ని గ్రాండ్ గా రీరిలీజ్ చేయనున్నారు.
ఇక ‘హరి హర వీరమల్లు’ చిత్ర కథ 17వ శతాబ్దంలోని మొఘల్ ల సామ్రాజ్యం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. దర్శకుడు క్రిష్ జాగర్లముడి (Krish) డైరెక్ట్ చేస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాన్ సరసన గ్లామర్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ఆడిపాడనుంది. అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఎంఎం కీరవాణీ సంగీతం అందిస్తున్నారు.