యాడ్ వీడియోలతో కూడా రికార్డ్స్ సృష్టిస్తున్న బన్నీ! 

By Sambi ReddyFirst Published Aug 30, 2022, 11:07 AM IST
Highlights

పుష్ప హిట్ తో బన్నీ రేంజ్ పదింతలు పెరిగింది. గ్లోబల్ బ్రాండ్స్ ఆయన వెనుకబడుతున్నాయి. తాజాగా ఆయన కోక కోలా బ్రాండ్ అంబాసర్ గా ఎంపికయ్యారు. ఈ యాడ్ వీడియో ట్విట్టర్ లో రికార్డు వ్యూస్ రాబట్టింది.

అల్లు అర్జున్ సినిమాలే కాదు ఆయన యాడ్స్ కూడా రికార్డ్స్ నెలకొల్పోతున్నాయి. అల్లు అర్జున్ కోక కోలా బ్రాండ్ అంబాసర్ గా ఎంపికయ్యాడు. దీంతో ఆయనపై ఓ యాడ్ షూట్ చేశారు. ఈ వీడియోలో బన్నీ మెస్మరైజింగ్ స్టెప్స్ తో ఆకట్టుకున్నారు. కాగా బన్నీ నటించిన కోక కోలా యాడ్ వీడియో రికార్డ్ వ్యూస్ రాబట్టింది. ట్విట్టర్ లో బన్నీ కోక కోలా యాడ్ కి 20 మిలియన్ వ్యూస్ దక్కాయి. 7 రోజుల్లో బన్నీ ఈ ఫీట్ సాధించాడు. ఇక పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన బన్నీ అరడజనుకు పైగా సంస్థలకు బ్రాండ్ అంబాసర్ గా ఉన్నారు. ఈ విషయంలో మహేష్ కి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నారు. 

మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 షూట్ కి సిద్ధమవుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే మూడు అదిరిపోయే సాంగ్స్ రూపొందించారట. పుష్ప సక్సెస్ నేపథ్యంలో పార్ట్ 2 భారీగా తెరకెక్కిస్తున్నారు. స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయడంతో పాటు క్యాస్టింగ్ కూడా పెంచేశారట. పరిశ్రమలో పుష్ప 2 పై భారీ అంచనాలున్నాయి. 

says "" 😎

This ad song hits '20Million' views in just 7days🔥🔥
DANCE KING things!!!👑

🔗: https://t.co/Jo3CxKvi2P Ec• pic.twitter.com/POhm4a6s86

— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun)

ఇక పుష్ప చిత్రం వరల్డ్ వైడ్ రూ. 360 కోట్ల గ్రాస్ రాబట్టింది. బాలీవుడ్ లో ఈ మూవీ వంద కోట్లకు పైగా వసూళ్లతో నయా రికార్డు నమోదు చేసింది. పుష్ప అసలు ఈ స్థాయి విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. పూర్ ఓపెనింగ్స్ దక్కించుకున్న పుష్ప మెల్లగా పుంజుకొని లాంగ్ రన్ నడిచింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో పుష్ప నష్టాలు మిగల్చడం కొసమెరుపు. 
 

click me!