Sita Ramam: డైరెక్టర్ ని కౌగిలించుకొని ఏడ్చేసిన సీతారామం హీరోయిన్

By Sambi ReddyFirst Published Aug 5, 2022, 3:52 PM IST
Highlights

సక్సెస్ మూమెంట్స్ భావోద్వేగానికి గురి చేస్తాయి. సీతారామం మూవీ సక్సెస్ టాక్ సొంతం చేసుకోగా యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో ప్రేక్షకుల మధ్య సీతారామం మూవీ చూసిన హీరోయిన్ మృణాల్  ఠాకూర్ కన్నీరు పెట్టుకున్నారు. పక్కనే దర్శకుడిని కౌగిలించుకొని తన ఆనందం వ్యక్తం చేశారు.

దర్శకుడు హను రాఘవపూడి(Hanu Raghavapudi) సీతారామం మూవీతో మ్యాజిక్ చేశారు. క్రిటిక్స్ ఈ మూవీని ఓ అద్భుతమైన క్లాసిక్ లవ్ స్టోరీగా అభివర్ణిస్తున్నారు. ప్రేక్షకులు సైతం సీతారామం మూవీ గొప్పగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. సీతారామం విజువల్స్, కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ గొప్పగా ఉన్నాయని ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా లీడ్ పెయిర్ దుల్కర్ సల్మాన్, మృణాల్  ఠాకూర్ మధ్య రొమాన్స్ కెమిస్ట్రీ బాగా పండాయి. ముఖ్యంగా మృణాల్  ఠాకూర్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ కన్నుల పండుగ అంటున్నారు. సీతారామం మూవీ సక్సెస్ క్రెడిట్ ఆమెకు దక్కేలా ఉంది. 

కాగా సీతారామం మూవీ(Sitar Ramam) యూనిట్ హను రాఘవపూడి, మృణాల్  ఠాకూర్, దుల్కర్ సల్మాన్ హైదరాబాద్ లో ప్రేక్షకుల మధ్య మూవీ చూశారు. ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో థియేటర్ నుండి బయటికి వచ్చిన అనంతరం మృణాళి ఠాకూర్ భావోద్వేగానికి గురయ్యారు. దర్శకుడు హను రాఘవపూడిని కౌగిలించుకొని ఏడ్చేశారు. తనకు ఓ అద్భుతమైన సినిమా ఇచ్చినందుకు ఆమె దర్శకుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దుల్కర్ సైతం హను రాఘవపూడిని గట్టిగా హగ్ చేసుకున్నారు. 

That moment 🥹 got emotional after watching movie with fans in Hyderabad 🥺😭❤ pic.twitter.com/rNAyuY0flZ

— 🦋Sita Ramam Day💃❣️ (@Nikki_Keerthy)

టాలీవుడ్ లో దుల్కర్, మృణాల్  ఠాకూర్(Mrunal Thakur) సీతారామం మూవీతో నిలదొక్కుకునే అవకాశం కలదు. ఇక మరాఠి మూవీతో వెండితెరకు పరిచయమైన మృణాళి ఠాకూర్ హిందీలో సూపర్ 30, బాట్ల హౌస్, తుఫాన్ వంటి చిత్రాల్లో నటించారు. తెలుగు రీమేక్ జెర్సీ హిందీ చిత్రంలో షాహిద్ కపూర్ కి జంటగా మృణాల్  ఠాకూర్ నటించారు. జెర్సీ ఘోర పరాజయం పొందింది. ప్రస్తుతం నాలుగు హిందీ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. 

ఇక స్వప్న సినిమా బ్యానర్ లో అశ్వినీ దత్ సీతారామం మూవీ తెరకెక్కించారు. రష్మిక మందాన కీలక రోల్ చేయగా... దర్శకుడు తరుణ్ భాస్కర్, సుమంత్, ప్రకాష్ రాజ్ ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశారు. సీతారామం చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. 

click me!