Sita Ramam on OTT: ఓటీటీలో సీతారామం... ఎప్పుడు? ఎక్కడంటే?

By Sambi ReddyFirst Published Aug 5, 2022, 2:53 PM IST
Highlights


సీతారామం టైటిల్ క్రెడిట్స్ లో ఓటీటీ ప్లాట్ ఫార్మ్ పై క్లారిటీ ఇచ్చారు. ప్రముఖ డిజిటల్ సంస్థ సీతారామం ఓటీటీ హక్కులు దక్కించుకున్నట్లు సమాచారం అందుతుండగా వివరాలు ఇలా ఉన్నాయి. 
 


ఆగస్టు 5న విడుదలైన సీతారామం(Sita Ramam) పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు హను రాఘవపూడి క్లాసిక్ లవ్ స్టోరీ తెరకెక్కించినట్లు క్రిటిక్స్ ప్రశంసిస్తున్నారు. విజువల్స్, క్యారెక్టరైజేషన్స్, స్క్రీన్ ప్లే అద్భుతం అంటూ కీర్తిస్తున్నారు. లీడ్ పెయిర్ దుల్కర్ సల్మాన్, మృణాళి ఠాగూర్ నటన, కెమిస్ట్రీ సిల్వర్ స్క్రీన్ పై బాగా పండింది. రష్మిక రోల్ మంచి సపోర్ట్ ఇచ్చింది. మొదటి 30 నిమిషాలు, కొన్ని రిపీటెడ్ సీన్స్ మినాయిస్తే ఓవరాల్ గా మూవీ అద్బుతమన్న మాట వినిపిస్తుంది. ఇక కమర్షియల్ గా ఈ మూవీ ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలంటే వీకెండ్ వరకు వేచి చూడాలి. 

కాగా ఈ మూవీ ఓటీటీ హక్కులు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. టైటిల్ క్రెడిట్స్ లో అమెజాన్ ప్రైమ్ కనిపించగా.. దీనిపై క్లారిటీ వచ్చింది. ఇక సీతారామం డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ అని తెలుస్తుండగా... ప్రసారం ఎప్పుడనేది తెలియాల్సి ఉంది. సాధారణంగా విడుదలైన నాలుగు వారాల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ చేసుకునేలా నిర్మాతలతో సంస్థలు ఒప్పందం చేసుకుంటున్నాయి. ఆ లెక్కన ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ మొదటివారంలో సీతారామం ప్రసారమయ్యే అవకాశం కలదు. 

అయితే ఇటీవల టాలీవుడ్ పెద్దలు కొన్ని సూచనలు చేశారు. ప్రేక్షకులు థియేటర్స్ ని రాకపోవడడానికి ప్రధాన కారణం ఓటీటీ సంస్థలని భావిస్తున్న నిర్మాతలు మూవీ విడుదలైన పది వారాల తర్వాత మాత్రమే ఓటీటీలో ప్రసారం చేయాలని నిర్దేశించారు. మరి ఈ నిబంధనకు ఓటీటీ సంస్థలు అంగీకారం తెలుపుతాయో లేదో తెలియదు. ఒకవేళ ఖచ్చితంగా పదివారాల తర్వాత సినిమా స్ట్రీమింగ్ అంటే ఓటీటీ సంస్థలు చెల్లించే రేటు తగ్గిపోవచ్చు. ఈ నిర్ణయంపై ఇంకా పూర్తి క్లారిటీ లేదు. కావున సీతారామం నాలుగు లేదా ఐదు వారాల్లో అందుబాటులోకి రావచ్చు. 

స్వప్న సినిమా బ్యానర్ లో అశ్వినీ దత్ సీతారామం చిత్రాన్ని నిర్మించాడు. సుమంత్, తరుణ్ భాస్కర్, ప్రకాష్ రాజ్ కీలక రోల్స్ చేశారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. 

click me!