Anupama: చిరంజీవిపై అనుపమ పరమేశ్వరన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఒక్క సినిమా ఛాన్స్ వస్తే చాలు..

Published : Aug 05, 2022, 01:15 PM IST
Anupama: చిరంజీవిపై అనుపమ పరమేశ్వరన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఒక్క సినిమా ఛాన్స్ వస్తే చాలు..

సారాంశం

నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కార్తికేయ 2. చందు ముండేది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ చిత్రం కార్తికేయ మూవీకి సీక్వెల్ గా కొనసాగుతోంది.

నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కార్తికేయ 2. చందు ముండేది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ చిత్రం కార్తికేయ మూవీకి సీక్వెల్ గా కొనసాగుతోంది. నిఖిల్ కి జోడిగా అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో నటిస్తోంది. 

ఆగష్టు 13న రిలీజ్ కానున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవలే అనుపమ కూడానా కార్తికేయ 2 ప్రమోషన్ లో జాయిన్ అయింది.  మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. క్యూట్ లుక్స్ తో అనుపమ చేసే మ్యాజిక్ వేరు. అందుకే యువతలో ఈ బ్యూటీ అంత గుర్తింపు సొంతం చేసుకుంది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ లో తనకి ఇష్టమైన నటుడు ఎవరో అనుపమ తెలిపింది. మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టం అని అనుపమ పేర్కొంది. ఆయన సినిమాలో నటించే ఛాన్స్ వస్తే చాలు. వెంటనే ఓకె చేస్తాను అంటూ అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

అనుపమ ఖాతాలో అ..ఆ.., శతమానం భవతి, హలొ గురు ప్రేమ కోసమే లాంటి హిట్స్ ఉన్నాయి. కార్తికేయ 2 రిజల్ట్ పై అనుపమ బోలెడు ఆశలే పెట్టుకుంది. చిరంజీవి చిత్రంలో అనుపమకి అవకాశం ఎప్పుడు వరిస్తుందో చూడాలి. గతంలో రాంచరణ్ రంగస్థలం చిత్రంలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ అనుపమ చేజారిపోయింది. ఆ మూవీలో మొదట హీరోయిన్ గా అనుకున్నది అనుపమనే. 

కార్తికేయ మొదటి భాగంలో స్వాతి హీరోయిన్ గా నటించింది. కానీ కకార్తికేయ 2 కోసం అనుపమని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. కానీ ఈ చిత్రంలో స్వాతి ప్రస్తావన కూడా ఉంటుందని నిఖిల్ ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Jr NTR: ఎన్టీఆర్ కి పొగరు ఎక్కువేమో అనుకున్న నటుడు, తారక్ తో ఒక్క సినిమా చేశాక అతను ఏమన్నాడంటే?
Rajinikanth Controversy: నేను ఏం మాట్లాడినా సమస్యే.. ట్రోల్స్‌పై రజినీకాంత్ ఫైర్