Sirivennela: అశ్రునయనాల మధ్య సిరివెన్నెలకు వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు

By telugu teamFirst Published Dec 1, 2021, 3:09 PM IST
Highlights

తెలుగు సాహిత్యం ఉన్నంత కాలం సిరివెన్నెల పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. సిరివెన్నెల లేకపోయినప్పటికీ ఆయన పాట పదిలంగా ఉంటుంది. అంతలా సిరివెన్నెల తెలుగు సాహిత్యంపై, చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు.

తెలుగు సాహిత్యం ఉన్నంత కాలం సిరివెన్నెల పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. సిరివెన్నెల లేకపోయినప్పటికీ ఆయన పాట పదిలంగా ఉంటుంది. అంతలా సిరివెన్నెల తెలుగు సాహిత్యంపై, చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న సిరివెన్నెల మంగళవారం కిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కొన్ని రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల ఈ నెల 24నే ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ఆరోగ్యం విషమించడంతో సిరివెన్నెల తుదిశ్వాస విడిచారు.   

బుధవారం రోజు Sirivennela Seetharama Sastry భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ లో ఉంచారు. ఆ తర్వాత మధ్యాహ్నం సిరివెన్నెల అంతిమ యాత్ర మొదలయింది. ఇక సిరివెన్నెల అంత్యక్రియలని మహా ప్రస్థానంలో నిర్వహించారు. తాజాగా సిరివెన్నెల అంత్యక్రియలు ముగిసాయి. 

సిరివెన్నెల పెద్ద కుమారుడు సాయి వెంకట యోగేశ్వరశర్మ సిరివెన్నెల చితికి నిప్పంటించారు. సిరివెన్నెల చిన్న కుమారుడు రాజా టాలీవుడ్ లో నటుడిగా రాణిస్తున్నాడు. సిరివెన్నెల మృతితో టాలీవుడ్ ఒక సాహితీ శకం ముగిసినట్లు అయింది.  Allu Arjun, మహేష్ బాబు, బాలకృష్ణ, నాగార్జున లాంటి ప్రముఖులంతా సిరివెన్నెలకు నివాళులర్పించారు. 

సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానుల అశ్రునయనాల మధ్య సిరివెన్నెల అంత్యక్రియలు ముగిశాయి. సిరివెన్నెల తన కెరీర్ లో ఎన్నో ఎవర్ గ్రీన్ సాంగ్స్ అందించారు. అలాగే 11 నంది అవార్డులు అందుకున్నారు. 

శ్రుతిలయలు, స్వర్ణ కమలం, గాయం, శుభలగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి ఎన్నో చిత్రాలకు సిరివెన్నెల నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. సిరివెన్నెల చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన ఆ పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారు. సిరివెన్నెల తన కెరీర్ లో 3 వేలకు పైగా పాటలు రాశారు. కానీ ఎప్పుడూ ఆయన విలువలు వదిలిపెట్టలేదు. సిరివెన్నెల పాటల్లో ఒక్క చెడు మాటనైనా కనిపెట్టడం కష్టం. సిరివెన్నెల ఆహ్లాదభరితమైన పాటలు, ప్రేమ పాటలు.. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని అంటూ సమాజాన్ని ఆలోచింపజేసే పాటలు ఎన్నో రాశారు.  

Also Read: Sirivennela: 3 సెకండ్లలోనే ఆ పాట, పొరపాటున స్వర్గానికి వెళితే.. సిరివెన్నెలపై ఆర్జీవీ కామెంట్స్

 

click me!