
టాలీవుడ్ లో జరుగుతున్న వరుస విషాదాలు ఊహించని షాక్ గా మారుతున్నాయి. రోజుల వ్యవధిలోనే శివశంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వారి మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరో టాలీవుడ్ హీరో ఇంట అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది.
టాలీవుడ్ లో యువ హీరో Kiran Abbavaram ఇప్పుడిపుడే గుర్తింపు సొంతం చేసుకుంటున్నాడు. కిరణ్ అబ్బవరం సోదరుడు రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తోంది. కడప జిల్లా చెన్నూరు వద్ద జరిగిన ప్రమాదంలో కిరణ్ సోదరుడు తుదిశ్వాస విడిచారట.
దీనితో కిరణ్ ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. బుధవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. టాలీవుడ్ కి కూడా ఇది మరొక షాక్. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
'రాజాగారు రాణి వారు' చిత్రంతో కిరణ్ అబ్బవరం టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ ఆర్ కళ్యాణమండపం చిత్రం కూడా విడుదలయింది. కిరణ్ సోదరుడు కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అయితే కారులో కిరణ్ అబ్బవరం సోదరుడితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Sirivennela death: కవీశ్వరుడా శివైక్యం అయ్యావా... సిరివెన్నెలకు మిత్రుడు ఇళయరాజా నీరాజనం!