Akhanda: ఆకాశంలో అఖండ  టార్గెట్... బాలయ్యకు ఇదో  పెద్ద ఛాలెంజ్!

By team teluguFirst Published Dec 1, 2021, 2:57 PM IST
Highlights

అఖండ మూవీపై భారీ హైప్ ఏర్పడిన నేపథ్యంలో ఆయన కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో అఖండ విడుదల చేస్తున్నారు. కాంబినేషన్ కి ఉన్న డిమాండ్ రీత్యా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో బాలయ్య అఖండ లక్ష్యం కొండెక్కి కూర్చుంది. 

మరికొన్ని గంటల్లో బాలయ్య అఖండ గా థియేటర్స్ లో గర్జించనున్నాడు. డిసెంబర్ 2న అఖండ విడుదల అవుతుండగా... యూఎస్ ప్రీమియర్స్ ఈరోజు రాత్రి మొదలు కానున్నాయి. అఖండ మూవీపై భారీ హైప్ ఏర్పడిన నేపథ్యంలో ఆయన కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో అఖండ విడుదల చేస్తున్నారు. కాంబినేషన్ కి ఉన్న డిమాండ్ రీత్యా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో బాలయ్య అఖండ లక్ష్యం కొండెక్కి కూర్చుంది. 


రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి అఖండ (Akhanda) రూ. 46.4 కోట్ల బిజినెస్ చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ హక్కుల ద్వారా మరో రూ. 7 కోట్ల బిజినెస్ జరిగింది. దాదాపు రూ. 53.5 కోట్లకు అఖండ థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోయాయి. అఖండ బ్రేక్ ఈవెన్ చేరాలంటే రూ. 54కోట్ల షేర్ రాబట్టాలన్న మాట. ఇక లాభాలలోకి వెళ్లాలంటే కనీసం రూ. 60 కోట్లకు పైగా షేర్ వసూళ్లు అందుకోవాలి. 


బాలయ్య (Balakrishna) గత చిత్రం రూలర్ కనీసం రూ.12 నుండి 13కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది. మొదటి వారం రూ. 9.3 కోట్ల షేర్ రాబట్టిన రూలర్ నెగిటివ్ టాక్ నేపథ్యంలో పూర్తిగా కూలబడిపోయింది. మరి రూలర్ తో పోల్చుకుంటే అఖండ ఆరు రెట్లు అధికంగా వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. వరుస పరాజయాలతో బాలయ్య మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. కాంబినేషన్ సమీకరణాలతో అఖండ భారీ బిజినెస్ చేసింది. అఖండ బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంటే తప్ప లాభాలు కురిపించదు. 

Also read Allu Arjun: `మెగా` కాదు, `అల్లు`నే ఫస్ట్.. ఎన్టీఆర్‌తో పోల్చడం వెనకాల బన్నీ ఉద్దేశ్యం అదేనా?
అయితే అఖండ అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీ ఎత్తున జరిగినట్లు సమాచారం. దీంతో ఓపెనింగ్స్ పరంగా అఖండ దుమ్ము దులిపే అవకాశం కలదు. ఇక అఖండ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా... ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లో మిర్యాల రవీంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Also read RRR ట్రైలర్ వాయిదా.. అధికారికంగా ప్రకటించిన జక్కన్న టీం
 

click me!