స్టార్ సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా తెలుగు ప్రేక్షకులను పరిచయం చేసుకోబోతున్నారు. తాజాగా ఆయన నటించిన ‘సర్కారు నౌకరి’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
స్టార్ సింగర్ సునీత (Sunitha) కొడుకు ఆకాష్ (Akash) హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకుంటుందన్న విషయం తెలిసిందే. ఆ మూవీ అప్డేట్ కోసం సునీత అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. తొలిచిత్రంతో తెలుగు ప్రేక్షకులను పరిచయం చేసుకోబోతున్నారు ఆకాష్. ఆ చిత్రానికి ‘సర్కారు నౌకరి’ (Sarkaru Naukari’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక తాజాగా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను టీమ్ విడుదల చేసింది.
దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు నిర్మాతగా ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ‘‘సర్కారు నౌకరి’’ చిత్రం తెరకెక్కుతోంది. సింగర్ సునీత తనయుడు ఆకాష్ ఈ సినిమాతో హీరోగా తెరకు పరిచయం కాబోతోన్నారు. భావనా వళపండల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇంట్రెస్టింగ్ గా ఉంది.
‘సర్కారు నౌకరి’ అంటూ రాబోతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మేకర్లు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌లో హీరో సైకిల్ మీద కనిపిస్తుండటం.. బ్యాక్ గ్రౌండ్‌లో ఉన్న చెట్టుకి ఓ డబ్బా వేలాడటం, దానిపై 'పెద్ద రోగం చిన్న ఉపాయం' అని రాసి ఉండటం ఇవన్నీ కూడా సినిమా మీద మరింత ఆసక్తిని పెంచేస్తున్నాయి.హీరో ఆకాష్ కూడా ఎంతో సహజంగా కనిపిస్తున్నారు. ఒక్కడి ఆలోచనతోనే విప్లవం మొదలవుతుంది అని ఈ ఫస్ట్ లుక్‌తో మేకర్లు వదిలిన క్యాప్షన్ చూస్తుంటే సినిమాలో కథ ఎంతో లోతుగా, బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు.
ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా సునీత స్పందించారు. ఇంట్రెస్టింగ్ నోట్ రాసుకొచ్చారు. ‘ఈ రోజు ఒక కొడుకు, తల్లి కల నిజమైంది.
శుభాకాంక్షలు ఆకాష్! ఈ మూవీ పోస్టర్ ప్రపంచంతో మీరు పంచుకోబోతున్న కథ మాత్రమే కాకుండా, మీ కలలను సాకారం చేసుకోవడానికి మీరు పడిన లెక్కలేనన్ని గంటల శ్రమ, అంకితభావం, త్యాగానికి ప్రతీకగా ఉంటుందన్నారు. మీ కలలు నెరవేరడం మొదలైంది. ఇప్పుడు, ఎప్పుడూ మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను‘ అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఇక ఈ చిత్రంలో ఆకాష్, భావనా వళపండల్ జంటగా నటిస్తున్నారు. తనికెళ్ల భరణి,సూర్య,సాయి శ్రీనివాస్ వడ్లమాని,మణిచందన,రాజేశ్వరి ముళ్లపూడి,రమ్య పొందూరి,త్రినాథ్, తదితర నటీనటులు ఆయా పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి మ్యూజిక్ : శాండిల్య, ఆర్ట్ డైరెక్టర్ : సినిమాటోగ్రఫీ,రచన,దర్శకత్వం : గంగనమోని శేఖర్ వహిస్తున్నారు.