
బాలీవుడ్ స్టార్ సీనియర్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. తాజాగా వారు. రీసెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. వివాహబంధంలో అడుగులు వేయడానికి రెడీ అవుతున్నారు. అయితే పెళ్ళికి ముందే ఈ జంట విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. డిన్నర్ డేట్ లు.. ఫారెన్ టూర్లతో పాటు.. దేవాలయాలు కూడా సందర్శిస్తు సందడి చేస్తున్నారు. తాజాగా ఈ జంట అమృత్‌సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు.
శ్రీ హర్మందిర్ సాహిబ్ లో ప్రత్యేక పూజలు చేశారు బాలీవుడ్ స్టార్ కపుల్ పరిణీతి చోప్రా , ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా. రీసెంట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్న వీరు... దైవ దర్శనాలు చేసుకుంటూ.. ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా .. శ్రీ హర్మందిర్ సాహిబ్ లో ప్రత్యేక పూజలు చేశారు. వీరు అమృత్ సర్ దేవాలయాన్ని సందర్శించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్న రాఘవ్-పరిణీతి త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మే 13వ తేదీన వీరి ఎంగేజ్‌మెంట్ ఢిల్లీలో ఘనంగా జరిగింది. రాజీవ్ చౌక్‌లోని కపుర్తాల హౌస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వేడుక జరిపించారు. ఈ ఏడాది అక్టోబర్ చివర్లో వీరు వివాహం చేసుకునే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఇక చాలా కాలంగా వీరు ప్రేమించుకుంటున్నా.. బయట కు పెద్దగా తెలియలేదు. అయితే సడెన్ గా వారు డిన్నర్ డేట్ లో కనిపించడంతో.. వీరి ప్రేమ విషయం వైరల్ అయ్యింది. అప్పుడప్పుడు వీరు బయట చెక్కర్లు కొడుతూ కనిపించడంతో..ఆ వార్తలు ఇంకా పెరిగిపోయాయి. దాంతో వెంటనే వీరు వివాహానికిరెడీ అయినట్టు తెలుస్తోంది.