షాకింగ్: ‘స్పై’ రెండో రోజుకే భారీ దెబ్బ!

Published : Jul 01, 2023, 03:57 PM IST
 షాకింగ్: ‘స్పై’ రెండో రోజుకే భారీ దెబ్బ!

సారాంశం

నిఖిల్ సిద్దార్థ్ – గ్యారీ కాంబినేషన్‌లో రూపొందిన యాక్షన్ సినిమానే ‘స్పై’. ఈ మూవీలో ఐశ్వర్య మీనన్, సనయా ఠాకూర్ హీరోయిన్లుగా నటించారు. 

‘కార్తికేయ 2’ నేషన్‌వైడ్ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత హీరో నిఖిల్ మరో నేషనల్ థ్రిల్లర్ ‘స్పై’తో వచ్చారు. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అయ్యిన ఈ సినిమాని చ‌ర‌ణ్ తేజ్ ఉప్పలపాటి సీఈఓగా ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె రాజ శేఖ‌ర్ రెడ్డి భారీ స్థాయిలో  నిర్మించారు. నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది.  అయితే సినిమా అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే రిలీజ్ కు ముందు విడుదలైన టీజర్ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావటం కలిసి వచ్చింది. సినిమాక నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా ఓపినింగ్ డే కలెక్షన్స్ మాత్రం అదరకొట్టింది. అయితే రెండో రోజుకే కలెక్షన్స్ డ్రాప్ అయినట్లు ట్రేడ్ వర్గాల సమచారం.

 ‘స్పై’ మూవీకి రెండో రోజు ఆశించిన రీతిలో స్పందన రాలేదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. రెండో రోజు వర్కింగ్ డే కావటం ,  నెగిటివ్ రివ్యూలు, సోషల్ మీడియాలో సినిమా బాగాలేదనే ప్రచారంతో సినిమాకు  తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు భారీగా పడిపోయాయి. ఫలితంగా రెండో రోజు ఈ మూవీ రూ. 1.50 – 1.70 కోట్లు షేర్‌ను మాత్రమే రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ. 2.10 – 2.30 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. అయితే స్పై నిఖిల్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.ఆ వివరాల్లోకి వెళితే. స్పై చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.11.70 కోట్లు గ్రాస్ రాబట్టింది.  

చరిత్ర మనకు ఎప్పుడూ నిజం చెప్పదు.. అంటూ నేతాజీ ఫైల్స్‌, మరణం మిస్టరీని చేధించే క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే సస్పెన్స్ ఎలిమెంట్స్‌తోపాటు స్వాతంత్య్రం అంటే ఒకడిచ్చేది కాదు.. లాక్కునేది..అని సినిమాలో వచ్చే డైలాగ్స్ ప్రేక్షకులను ఆలోచింపజేసేలా సాగుతున్నాయి. నిఖిల్ మరోవైపు ది ఇండియా హౌజ్‌, స్వయంభు, కార్తికేయ 3 సినిమాలను కూడా లైన్‌లో పెట్టాడు. నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథను అందించిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ..  ఐదు భాషల్లో విడుదల అయ్యింది. శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. గ్యారీ బిహెచ్ ఈ చిత్రానికి ఎడిటింగ్ కూడా చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ