కన్నీళ్లు రావట్లేదు.. 2021 విషాదాలు, మ్యారేజ్ లైఫ్ గురించి సింగర్ సునీత ఆసక్తికర వ్యాఖ్యలు

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 31, 2021, 06:29 PM IST
కన్నీళ్లు రావట్లేదు.. 2021 విషాదాలు, మ్యారేజ్ లైఫ్ గురించి సింగర్ సునీత ఆసక్తికర వ్యాఖ్యలు

సారాంశం

తన మధుర గాత్రంతో సింగర్ సునీత ఎందరో అభిమానులని సొంతం చేసుకుంది. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీత టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. సింగర్ సునీత ఈ ఏడాది రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

తన మధుర గాత్రంతో సింగర్ సునీత ఎందరో అభిమానులని సొంతం చేసుకుంది. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీత టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. సింగర్ సునీత ఈ ఏడాది రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రామ్ వీరపనేని అనే వ్యాపార వేత్తని వివాహం చేసుకుని సంతోషంగా గడుపుతోంది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సునీత తన మ్యారేజ్ లైఫ్, 2021 విషాదాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మ్యారేజ్ తర్వాత నేను ఎలా ఉన్నాను అనేది నా ముఖం చూస్తే అర్థం అవుతుంది. పర్సనల్ లైఫ్ లో నాకు నచ్చినట్లు బతకాలనుకున్నాను. అలాగే బతుకుతున్నాను. నేను ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. 

రామ్ కి ఏదైనా సాయం అవసరం అయితే భార్యగా చేస్తాను అని సునీత అన్నారు. ఇక 2021 విషాదాల గురించి సునీత మాట్లాడుతూ.. బాలు గారికి పోగొట్టుకున్నా. బాలు గారి మరణం కన్నీళ్లు తర్వాత కన్నీళ్లు కూడా రావడం లేదు. ఏదైనా విషాద ఘటన గురించి విన్నప్పుడు మహా అయితే షాక్ అవుతున్నా. అంతే కానీ ఏడుపు, కన్నీళ్లు రావడం లేదు. బాలుగారి మృతి అంత తీవ్రంగా బాధించింది అని సునీత అన్నారు. బాలు గారు లేని లోటు తీర్చలేనిది అంటూ సునీత ఎమోషల్ అయ్యారు. 

సునీత అందం పరంగా కూడా అభిమానులను ఆకర్షిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చేరువగా ఉంటుంది సునీత. సునీత ప్రస్తుతం పలు చిత్రాల్లో హీరోయిన్లలకు డబ్బింగ్ అందిస్తోంది. అలాగే చాలా చిత్రాల్లో పాటలు పాడుతోంది. 

Also read: చీరకట్టులో తమిళ చిన్నది.. మెస్మరైజింగ్ ఫోజులు చూడాల్సిందే

PREV
click me!

Recommended Stories

Peddi Controversy: రామ్ చరణ్ మాటలకు క్రికెటర్ బుమ్రా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడా? అసలేం జరిగింది?
Bandla Ganesh House: బండ్ల గణేష్‌ కొత్తింటి ధర ఎన్ని కోట్లో తెలిస్తే మతిపోవాల్సిందే.. చిరంజీవి ఇంటి ధర అందులో సగం కూడా ఉండదు