Vishwak Sen: బిగ్ షాక్.. హీరో విశ్వక్ సేన్ కి కరోనా పాజిటివ్, వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 31, 2021, 04:02 PM IST
Vishwak Sen:  బిగ్ షాక్.. హీరో విశ్వక్ సేన్ కి కరోనా పాజిటివ్, వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ..

సారాంశం

ఇప్పటి వరకు కరోనా సోకిందంటూ బాలీవుడ్ నటీనటులు వార్తల్లో ఉంటూ వచ్చారు. ఇప్పుడు కరోనా టాలీవుడ్ కు కూడా వచ్చేసింది. కరోనా ప్రస్తుతం దేశం మొత్తం మూడవ దశ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటి వరకు కరోనా సోకిందంటూ బాలీవుడ్ నటీనటులు వార్తల్లో ఉంటూ వచ్చారు. ఇప్పుడు కరోనా టాలీవుడ్ కు కూడా వచ్చేసింది. కరోనా ప్రస్తుతం దేశం మొత్తం మూడవ దశ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న సంగతి తెలిసిందే. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. 

తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కరోనా బారిన పడ్డాడు. తనకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు విశ్వక్ సేన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. 'అందరికి హాయ్.. నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీనితో నేను ఐసోలేషన్ లోకి వెళ్ళాను. డాక్టర్ సలహాలు పాటిస్తూ చికిత్స పొందుతున్నాను. నేను వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ కరోనా వైరస్ సోకింది. ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించి సేఫ్ గా ఉండండి' అని విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. 

వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఈ యువ హీరోకి కరోనా సోకడం ఊహించని పరిణామమే అని చెప్పొచ్చు. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కూడా ఇండియాలో  వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీనితో దేశం మొత్తం ప్రస్తుతం థర్డ్ వేవ్ టెన్షన్ మొదలయింది. విశ్వక్ సేన్ ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్, హిట్, పాగల్ చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా హిట్ చిత్రంలో అతడి నటనకు ప్రశంసలు దక్కాయి. 

 

టాలీవుడ్ ప్రస్తుతం కరోనా, టికెట్ ధరల సమస్యలతో గడ్డు పరిస్థితులని ఎదుర్కొంటోంది. జనవరిలో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లాంటి పాన్ ఇండియా చిత్రాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా బాలీవుడ్ లో కొద్దీ రోజుల క్రితమే అర్జున్ కపూర్, అన్షులా కపూర్, రియా కపూర్ కోవిడ్ బారిన పడ్డారు. అలాగే ఐటెం బ్యూటీ నోరా ఫతేహి కూడా కోవిడ్ కి గురైంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కూడా కోవిడ్ కి గురైన సంగతి తెలిసిందే. 

Also Read: పింక్ శారీలో హరివిల్లులా అనసూయ.. వయ్యారాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?