Bigg boss Telugu 5: బిగ్ బాస్ షోతో షణ్ముఖ్ కి అంతా లాసేనా..?

Published : Dec 31, 2021, 05:17 PM ISTUpdated : Dec 31, 2021, 05:22 PM IST
Bigg boss Telugu 5: బిగ్ బాస్ షోతో షణ్ముఖ్ కి అంతా లాసేనా..?

సారాంశం

మొదటి నుండి టైటిల్ ఫేవరేట్  గా ఉన్న షణ్ముఖ్ సిరి(Siri)తో రిలేషన్ కారణంగా గేమ్ లో వెనుకబడ్డాడు. ఆమె విషయంలో ఓవర్ పొసెసివ్ గా తయారయ్యాడు. దానితో సిరి ఎవరికి దగ్గరవుతుందోనన్న భయంతో ఆమెతో గొడవలు పెట్టుకునేవాడు. 

బిగ్ బాస్ షో (Bigg boss Telugu 5)షణ్ముక్ కి లాభం కంటే నష్టమే ఎక్కువ చేసిందనిపిస్తుంది. సీజన్ 5 రన్నర్ గా ఆయనకు మిగిలింది ఏమీ లేదంటున్నారు. మానసిక ఒత్తిడి, లవర్ దీప్తి సునైనతో గొడవలు అనవసర బోనస్ లా తగులుకున్నాయి అంటున్నారు. హౌస్ నుండి బయటికి వచ్చాక షణ్ముఖ్ పరిస్థితి ఏమంత బాగోలేదనిపిస్తుంది. 

షణ్ముక్ జస్వంత్(Shanmukh) , దీప్తి మధ్య మనస్పర్థలు తలెత్తాయని చాలా మంది అభిప్రాయం.  ఈ మధ్య దీప్తి ఇంస్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమె పరోక్షంగా షణ్ముఖ్ పై కోపాన్ని ప్రదర్శించారు. హౌస్ లో షణ్ముఖ్ లేడీ కంటెస్టెంట్ సిరితో నడిపిన ప్రేమాయణమే దీనికి కారణం అని మెజారిటీ వర్గాల అనుమానం. హౌస్ లో సిరి-షణ్ముఖ్ హద్దులు మీరు ప్రవర్తించారు. దానికి సిరి అమ్మ చేసిన కామెంట్స్ నిదర్శనం. హగ్గులు తగ్గించి గేమ్ ఫై ఫోకస్ పెట్టండి, మీరు అలా చేయడం నాకు నచ్చడం లేదని సిరి మదర్ ఓపెన్ గా చెప్పారు. 

మొదటి నుండి టైటిల్ ఫేవరేట్  గా ఉన్న షణ్ముఖ్ సిరి(Siri)తో రిలేషన్ కారణంగా గేమ్ లో వెనుకబడ్డాడు. ఆమె విషయంలో ఓవర్ పొసెసివ్ గా తయారయ్యాడు. దానితో సిరి ఎవరికి దగ్గరవుతుందోనన్న భయంతో ఆమెతో గొడవలు పెట్టుకునేవాడు. తనకు తెలియకుండానే మానసిక వేదనకు గురిచేసేవాడు. సిరిని వేధించడం కూడా షణ్ముఖ్ పై నెగిటివ్ ఇంపాక్ట్ తెచ్చింది. 

ఫ్రెండ్స్ అని చెప్పు కుంటూ లవర్స్ కి మించి రెచ్చిపోయారు ఈ జంట. షో మధ్యలో దీప్తి బిగ్ బాస్ వేదికపైకి రావడం జరిగింది. అప్పుడు ఆమె మామూలుగానే ప్రవర్తించారు. షణ్ముఖ్ పై ప్రేమ కురిపించారు. బాగా ఆడుతున్నావ్ అంటూ సప్పోర్ట్ చేశారు. తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు. హౌస్ నుండి బయటికి వచ్చాక షణ్ముఖ్ సిరిని కలవలేదనిపిస్తుంది. ఇటీవల సోషల్ మీడియా చాట్ లో షణ్ముఖ్ కామెంట్స్ పరిశీలిస్తే ఇది  అర్థమవుతుంది. 

Also read Samantha 2022 Plans: వాళ్లతో గడిపేస్తా... సమంత నెక్స్ట్ ఇయర్ ప్లాన్స్

 ఈ సోషల్ మీడియా ఇంటరాక్షన్ లో నెటిజెన్స్ ప్రశ్నకు సమాధానంగా బ్రేకప్ లాంటిది ఏం లేదని షణ్ముక్ జస్వంత్ అన్నాడు. మరోవైపు దీప్తి సునైన పోస్ట్స్ అనుమానం రేకెత్తిస్తున్నాయి. దీప్తి కోపంగా ఉందని షణ్ముఖ్ కన్ఫర్మ్ చేయడం మరో కొసమెరుపు. ఇవన్నీ పరిశీలిస్తుంటే బిగ్ బాస్ షో వలన షణ్ముఖ్ కి దక్కిందేమీ లేదనిపిస్తుంది. ఆయన 15వారాలు హౌస్ లో ఉండడం వలన పారితోషికం రూపంలో రూ. 20 నుండి 30 లక్షలు వచ్చి ఉంటాయి. ఆ మొత్తం బయట ఉన్నా షణ్ముఖ్ సంపాదించగలడు.షోకి వెళ్లకుండా ఉంటే ముఖ్యంగా దీప్తి సునైనతో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉండేది కాదు. 

Also read Vishwak Sen: బిగ్ షాక్.. హీరో విశ్వక్ సేన్ కి కరోనా పాజిటివ్, వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ..

 

PREV
click me!

Recommended Stories

Nagarjuna తో పోటీకి దిగి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్, ఇంతకీ ఆమూవీ ఏదో తెలుసా?
Savitri: మహానటి జీవితం నాశనం కావడానికి జెమినీ గణేషన్‌, పొలిటీషియన్‌ మాత్రమే కాదు, ఆ మూడో వ్యక్తి ఇతడేనా?