
దప్రముఖ గాయని మంగ్లీకి పెనుప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును డీసీఎం వెనక నుంచి ఢీకొట్టగా ఆమెతో పాటు కారులోని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగిందని శంషాబాద్ పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా నందిగామ కన్హ ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరై తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో మంగ్లీ కారు ప్రమాదానికి గురైంది.
వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరయ్యారు. ఆ తరువాత అర్ధరాత్రి తిరిగొస్తుండగా డీసీఎం వారి కారును ఢీకొట్టింది. ఈ ఘటన శంషాబాద్ తొండుపల్లి సమీపంలో చోటుచేసుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న మంగ్లీ తిరిగి బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.
తొండపల్లి సమీపంలో రాగానే మంగ్లీ కారుని ఓ డీసీఎం వాహనం వెనుక నుండి వచ్చి ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న మేఘరాజ్ ,మనోహర్ లతో సహా మంగ్లీ ఉన్నారు. ఈ ముగ్గురికి స్వల్ప గాయాలు అవ్వగా డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.