
రీసెంట్ గా మలయాళంలో విడుదలై సంచలన విజయం సాధించి రికార్డుల మీద రికార్డులు తిరగ రాస్తున్నచిత్రం మంజుమ్మెల్ బాయ్స్. ఇప్పుడ ఎక్కడ చూసినా ఈసినిమా సృష్టిస్తున్న సెన్సేషన్ గురింజచే. అంతా కొత్త వారితో రియల్ ఇన్సిడెంట్ అధారంగా తెరకెక్కిన ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తోంది. నిజ జీవిత సంఘటనలు అధారంగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు నుంచే సూపర్ సాజిటివ్ టాక్‌తో కేరళలో దూసుకువెళ్తోంది. తమిళంలో రిలీజ్ చేస్తే అక్కడ సెన్సేషన్ అయ్యింది. ఇంతవరకు ఏ పెద్ద స్టార్ చూడలేని విజయాన్ని, ఏ చిత్రానికి సాధ్యపడని వసూళ్లను రాబడుతూ మలయాళ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం తెలుగు రైట్స్ తీసుకుని రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ రైట్స్ ని మైత్రీ తో పాటు మెట్రో సురేష్ నిరంజన రెడ్డిల భాగస్వామ్యంలో మళయాళ నిర్మాతలు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మార్చి 29 న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో భారీ ఎత్తున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ఇప్పటికే వెల్లడించింది. దాంతో ఈ చిత్రం రైట్స్ ఎంతకు వెళ్లాయనే చర్చ మొదలైంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ ని రెండు కోట్లకు తీసుకున్నారని, ఇదే ఈ మధ్యకాలంలో కొత్త వాళ్లతో వచ్చిన సినిమాకు పెట్టిన రేటు అంటున్నారు.
ఇప్పటికే మన తెలుగు వాళ్లు కూడా ఈ సినిమాను మలయాళంలోనూ చూస్తు ప్రశంసలు గుప్పిస్తుండడం విశేషం. కామెడీ, ఎమోషన్, సంగీతం, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఇలా అన్ని రకాల భావోద్వేగాలతో ప్రేక్షకుడిని సీట్ ఎట్జ్‌లో కూర్చోబెట్టేలా రూపొందిన ఈ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించారు. దీంతో ఇప్పుడు తమిళ, మలయాళ సెలబ్రిటీలు ఈ డైరెక్టర్‌ని ఓ రేంజ్‌లో మెచ్చుకుంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.
కథ ఏమిటంటే.... కేరళలో ని మంజుమ్మెల్ (Manjummel) ప్రాంతానికి చెందిన గ్రూప్ ఆఫ్ ప్రెండ్స్ దాదాపు ఓ పది మంది టూర్‌కు వెళ్లి తిరిగి వస్తుంటారు. ఈక్రమంలో కమల్‌హసన్ నటించిన గుణ అనే సినిమా షేటింగ్ జరిగిన ఓ గుహను చూడడం మరిచిపోయామంటూ ఆ గుహ దగ్గరకు వెళతారు. అప్పుడు అనుకోకుండా ఒకతను ఆ గుహాలో పడి పోతాడు. దీంతో అతనిని బయటకి తీసుకురావడానికి ఆ మిత్ర బృందం చేసిన సాహసం నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. ఇంకా చాలా సన్నివేశాలలో గుణ సినిమాలోని కమ్మనీ ఈ ప్రేమను అనే పాటను, కమల్ వాయిస్‌ను బాగా వాడడం కూడా ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది.