
హీస్ట్ జానర్ లో హీరోయిన్స్ ని పెట్టి సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది బాలీవుడ్ కు. బోల్డ్ గా బాలీవుడ్ భామలు టబు, కరీనా కపూర్ ఖాన్, నేషనల్ అవార్డు విన్నర్ కృతిసనన్ చూపిస్తూ వస్తున్న తాజా చిత్రం ‘క్రూ’. లూట్‌కేస్’ ఫేమ్ రాజేష్ కృష్ణన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ఏక్తాకపూర్, రియాకపూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 29న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
టబు, కరీనా కపూర్, కృతీసనన్ ప్రధాన పాత్రల్లో, దిల్జీత్ సింగ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ది క్రూ’. కార్పొరేట్ ఏవియేషన్ బిజినెస్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో టబు, కరీనా, కృతీ ఎయిర్‌హోస్టెస్‌గా నటించారు. ఓ విమానం హైజాకింగ్, దొంగతనం నేపథ్యంలో ‘ది క్రూ’ సినిమా కథనం ఉంటుందని బీ టౌన్ టాక్ . ఇక బాలీవుడ్‌లో ‘లూట్‌కేస్’ సినిమా తీసిన రాజేష్ కృష్ణన్ ఈ సినిమాకు దర్శకుడు. విమానంలోని ప్రయాణికుల వస్తువులను, బంగారాన్ని దొంగిలించడానికి ఎయిర్‌హోస్టెస్‌గా నటిస్తూ.. ఈ అందాల ముద్దు గుమ్మలు చేస్తున్న సందడి అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ‘దీపావళికి బోనస్ ఇస్తారా మేడమ్?.. దీపావళికి స్వీటు డబ్బాలే దొరకవు. ఇంకా బోనస్ ఎక్కడిది’ లాంటి సరదా సంభాషణలతో ఆద్యంతం ఆసక్తిగా సాగుతోంది ఈ ట్రైలర్.
ఇల్లీగల్‌గా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న వారి వద్ద నుంచి వీరు గోల్డ్ దొంగిలించడం. అక్కడ నుంచి కథ ఎలా మలుపు తిరిగింది అనేది సినిమా స్టోరీ. ఇక ఈ చిత్రంలో పంజాబీ యాక్టర్ దిల్జీజ్ దోసాంజ్, కపిల్ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘వీరే ది వెడ్డింగ్ (2018)’, ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్(2023)’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ నిర్మించిన రేఖా కపూర్, ఏక్తా కపూర్ ‘ది క్రూ’ సినిమాను నిర్మించారు.