
గాయనిగా లతా మంగేష్కర్ జీవితంలో అధిరోహించిన శిఖరాలు ఎన్నో. సుదీర్ఘ సంగీత ప్రయాణంలో ఆమె అనేక అవార్డులు రివార్డులు అందుకున్నారు. భారత దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఆమె కీర్తి కిరీటంలో చేరింది. అలాగే అనేక ఉన్నత పురస్కారాలు లతాజీ గానానికి దాసోహం అన్నాయి. ఆమె అందుకున్న గౌరవాలు, పురస్కారాలు, అవార్డులు, రివార్డుల చిట్టా చాలా పెద్దది.
లతా మంగేష్కర్ మూడు సార్లు గాయనిగా నేషనల్ అవార్డుకి ఎంపికయ్యారు. 1972లో పరిచయ్ చిత్రానికి గాను మొదటి నేషనల్ అవార్డు గెలుపొందారు. ఆ తర్వాత 1994లో కోరా కాగజ్ చిత్రానికి, 1990లో విడుదలైన లేకిన్ చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్నారు.
ఇక భారత ప్రభుత్వం ఆమె సేవలకు గుర్తింపుగా... 1969లో పద్మభూషణ్, 1989లో దాదా సాహెబ్ పాల్కే, 1999లో పద్మ విభూషణ్, 2001లో భారతరత్న అవార్డులకు ఎంపిక చేశారు. భారతరత్న అందుకున్న ఏకైన గాయని లతా మంగేష్కర్ కావడం విశేషం.
ఇవి కాక అనేక ఐదు సార్లు మహారాష్ట్ర స్టేట్ అవార్డ్స్ అందుకున్నారు. ఏకంగా ఏడు పర్యాయాలు ... ఫిలిం ఫేర్ అవార్డును గెలుపొందారు. ఫ్రాన్స్ గవర్నమెంట్ 2006లో లీజన్ ఆఫ్ హానర్ గౌరవంతో సత్కరించింది. లతాజీ కెరీర్ లో అందుకున్న కొన్ని అత్యుత్తమ పురస్కారాల లిస్ట్ ఇది.
పద్శభూషణ్ (1969)
దాదా సాహెబ్ ఫాల్కే (1989)
మహారాష్ట్ర భూషన్ అవార్డు (1997)
ఎన్.టి.ఆర్. జాతీయ అవార్డు (1999)
శాంతినికేతన్, విశ్వభారతి, శివాజీ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్
రాజాలక్ష్మీ అవార్డు (1990)
పద్శవిభూషణ్ (1999)
భారతరత్న (2001)
ది లీజియన్ అఫ్ హానర్ (2006)
ఎ.ఎన్.ఆర్. జాతీయ అవార్డు (2009)
అప్సరా అవార్డు
కాళిదాస్ సమ్మాన్ అవార్డు
తాన్ సేన్ అవార్డు
నేపాల్ అకాడమీ అవార్డు
సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు.