
ఉత్తరాది గాన కోకిల లతా మంగేష్కర్(Lata Mangeshkar) ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. గత నెల మొదటి వారం నుంచి హాస్పిటల్ లోనే ఉన్న లతాజీ.. మరోసారి విషమ పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. కరోనాతో గత నెల 8న ముంబై లోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో చేరిన లతా(Lata Mangeshkar)జీ.. అప్పటి నుంచి ఐసీయూలోనే ట్రిట్ మెంట్ తీసుకుంటున్నారు.
ఈ మధ్య ఆమె ఆరోగ్యం కుదుటపడ్డట్టు డాక్టర్లు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ మరోసారి ఆమె ఆరోగ్యం విషమంగా మారింది. కాగా కొద్దిసేపటి క్రితమే ఆమె మరణించినట్లు బీచ్ క్యాండీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. లతా మంగేష్కర్ మృతితో దేశవ్యాప్తంగా అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. లతా మంగేష్కర్ మృతి చెందడంతో సినీ రాజకీయ క్రీడా ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
టాలీవుడ్ సెలెబ్రిటీలు రవితేజ, అనిల్ రావిపూడి, కాజల్ అగర్వాల్ లతా మంగేష్కర్ మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. హీరో రవితేజ ట్విట్టర్ వేదికగా.. లతా మంగేష్కర్ గారు మరణించారని తెలిసి చాలా బాధపడ్డాను. ప్రపంచంలోనే గొప్ప సింగర్స్ లో ఆమె ఒకరు. లతా మంగేష్కర్ ఆత్మకు గారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులు నా ప్రగాఢ సానుభూతి అని రవితేజ ట్వీట్ చేశారు.
'లెజెండ్రీ సింగర్, నైటింగేల్ లతా మంగేష్కర్ గారి మరణ వార్త నన్ను తీవ్రంగా బాధించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి' అని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.
'ఇండియా నైటింగేల్ ని కోల్పోయింది. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నాం.. కానీ మీ లెగసీ ఎప్పటికి ఉంటుంది.. లతా మంగేష్కర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి'అంటూ కాజల్ అగర్వాల్ సంతాపం తెలిపింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ట్విట్టర్ వేదికగా లతా మంగేష్కర్ మృతికి సంతాపం తెలిపారు. 'లతా మంగేష్కర్ గారి మృతి తీవ్రంగా బాధించింది. కొన్ని తరాల నుంచి ఆమె మధురమైన గాత్రం ఇండియన్ మ్యూజిక్ ని నిర్వచిస్తోంది. ఆమె మృతికి నా సంతాపం.. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నా. తప్పకుండా మరో లతా మంగేష్కర్ ని చూడలేం' అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.