వాళ్ళిద్దరి వేధింపుల వల్లే జయం రవి నా దగ్గరికి వచ్చాడు.. సింగర్ షాకింగ్ కామెంట్స్, కొత్త కోణం వెలుగులోకి

By tirumala AN  |  First Published Sep 28, 2024, 4:10 PM IST

ప్రముఖ నటుడు జయం రవి, ఆయన భార్య ఆర్తి విడిపోవడానికి గల కారణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జయం రవి మానసిక క్షోభకు గురవుతున్నారని, సైకాలజిస్ట్ కెనిషా నుండి చికిత్స తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. 


ప్రముఖ నటుడు జయం రవి విడాకుల వ్యవహారంలో రోజుకొక ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఇటీవల జయం రవి తన భార్యతో విడిపోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తన భార్య ఆర్తితో దాదాపు 15 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు పలకాలని డిసైడ్ అయ్యాడు. 2009లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఆరవ్, అయాన్ సంతానం. జయం రవి, ఆర్తి విడిపోవడానికి గల కారణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 

పొన్నియన్ సెల్వంతో జయం రవికి గుర్తింపు 

తెలుగు తమిళ భాషల్లో జయం రవి క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. జయం రవి తని ఒరువన్, టిక్ టిక్ టిక్, పొన్నియన్ సెల్వన్ లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించారు. పొన్నియన్ సెల్వం చిత్రంలో జయం రవి పాత్రకి మంచి గుర్తింపు దక్కింది. అయితే వేగంగా సినిమాల్లో నటించడంలో జయం రవి వెనుకబడ్డారు. 

Latest Videos

ఇదిలా ఉండగా జయం రవి విడాకుల వ్యవహారం గురించి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. జయం రవి వ్యక్తిగత జీవితం గురించి కూడా అంతా చర్చించుకుంటున్నారు. ఆర్తి తల్లి, జయం రవి అత్తగారు అతడిని చులకనగా చూస్తున్నారు అనే రూమర్స్ కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా జయం రవి అసలు విడాకుల విషయాన్ని తనకు చెప్పలేదని, తనతో చర్చించలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాడని ఆరోపించింది. ఇదిలా ఉండగా జయం రవి రిలేషన్ షిప్ గురించి గురించి కూడా అనేక వార్తలు వచ్చాయి. జయం రవి.. కెనిషా అనే సింగర్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 

ట్రీట్మెంట్ కోసమే లేడి సింగర్ దగ్గరకి జయం రవి 

ఈ రూమర్స్ పై జయం రవి ఆల్రెడీ వివరణ ఇచ్చారు. తాజాగా కెనిషా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. కెనిషా సింగర్ గా రాణిస్తూనే సైకాలజిస్ట్ గా కూడా పనిచేస్తోంది. జయం రవితో నాకు పరిచయం ఉంది కానీ.. మా మధ్యన ఎలాంటి సంబంధం లేదు. జయం రవికి నేను సైకాలజిస్ట్ గా ట్రీట్ మెంట్ చేస్తున్నాను. జయం రవిని అతడి భార్య, అత్తగారు ఇద్దరూ మానసికంగా వేధించారు. మానసికంగా గాయపడిన జయం రవి నాదగ్గర చికిత్స తీసుకుంటున్నాడు. మేమిద్దరం కలసి ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ప్రారంభించాలనే ప్లాన్ లో ఉన్నట్లు తెలిపింది. 

జయం రవి భార్య ఆర్తి ఆరోపణలు 

ఆర్తి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవంలేదు. తన తప్పులు బయట పడతాయనే భయంతోనే ఆర్తి ఇలా ఆరోపణలు చేస్తోంది అని కెనీశా తెలిపింది. జయం రవి, కెనిషా ఇద్దరూ గోవాలో వెకేషన్ కి వెళ్లినట్లు గతంలో రూమర్స్ వచ్చాయి. ఆర్తి మరో ఆరోపణ కూడా చేసింది. తనకి పిల్లలకు ఎలాంటి ఆర్థిక సహకారం లేకుండా ఒంటరిగా వదిలేశాడని ఆరోపించింది. దీనితో జయం రవి స్పందించారు. ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదు. మొత్తం పిల్లలు, ఆర్తి కోసం వదిలేసి నేను ఖాళీ చేతులతో బయటకి వచ్చేశా అని జయం రవి సమాధానం ఇచ్చారు. 

జయం రవి ఫ్యామిలీ గురించి తెలుసా ?

తన పిల్లల సంరక్షణ బాధ్యత తనదే అని జయం రవి తెలిపాడు. పిల్లలు తన వద్దే ఉండాలని.. దీనికోసం కోర్టులో పోరాడతా అని జయం రవి కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది. తన విడాకుల విషయంలోకి మరొక అమ్మాయిని తీసుకురావద్దని కూడా జయం రవి కోరారు. ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా.. జయం రవికి సోదరుడు. చిరంజీవితో గాడ్ ఫాదర్ చిత్రాన్ని తెరకెక్కించింది ఇతడే. జయం రవి హీరోగా మోహన్ రాజా దర్శకుడిగా తని ఒరువన్ అనే బ్లాక్ బస్టర్ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని రాంచరణ్ తెలుగులో ధృవగా రీమేక్ చేశారు. ప్రముఖ ఎడిటర్ మోహన్ కుమారులే జయం రవి, మోహన్ రాజా. 

జయం రవి, ఆర్తి వివాహ వేడుక 2009లో ఘనంగా జరిగింది. వీళ్లిద్దరి వివాహ వేడుకకి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, అర్జున్ ఇలా చాలా మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు 15 ఏళ్ళు అన్యోన్యంగా జీవించిన వీరిద్దరూ విడిపోవడం షాకింగ్ గా మారింది. జయం రవి సినిమాల విషయంలో అత్తగారి ప్రమేయం ఎక్కువైందని రూమర్స్ వచ్చాయి. ఈ విషయంలో జయం రవి, ఆర్తి గొడవ పడ్డారట. అలా వారిద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చినట్లు తెలుస్తోంది. 

click me!