Vikram - Suriya - Shankar : తమిళ చిత్ర పరిశ్రమలో విక్రమ్-సూర్యలు టాప్ హీరోలు. తమిళ పరిశ్రమలోనే కాదు దేశవ్యాప్తంగా వీరికి మస్తు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే, వీరిద్ధరూ దాదాపు 21 ఏళ్ల తర్వాత మళ్లీ శంకర్ డైరెక్షన్ లో కలిసి తెరపై కనిపించబోతున్నారు.
Vikram - Suriya - Shankar : మరోసారి ఇద్దరు బడాస్టార్లు సిల్వర్ స్క్రీన్ పై కలిసి కనిపించబోతున్నారు. వీరిద్దరూ భారతీ చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. దక్షిణాదిలో స్టార్ హీరోలు. వీరికి మరో స్టార్ డైరెక్టర్ తోడు కావడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. సీని వర్గాల్లో కూడా మరింత ఆసక్తిని పెంచింది. వారే సూర్య-విక్రమ్-శంకర్.
భారతీయ చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ శంకర్ అద్భుతమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఇక సూర్య, విక్రమ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ సినిమా హీరోలు అయినా వారి అద్భుతమైన నటనతో పాన్ ఇండియా స్టార్లుగా గుర్తింపు సాధించారు. తెలుగు, తమిళ్, మలయాళం, హింది ఇలా చాలా భాషల్లో వారి సినిమాలకు మంచి స్పందన ఉంటుంది.
ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందించిన ప్రముఖ సౌత్ ఇండియన్ డైరెక్టర్ శంకర్ ఇటీవల భారతీయుడు-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కమల్ హాసన్, సిద్ధార్ద్ వంటి స్టార్ నటుటలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారతీయుడు-2 సినిమా అనుకున్నంతగా ఆదరణను రాబట్టలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందనే చెప్పాలి. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
ఇప్పుడు డైరెక్టర్ శంకర్ తన తర్వాతి ప్రాజెక్టు కోసం సిద్ధమవుతున్నారు. ఇది మరో క్రేజీ కాంబో కానుందని తెలుస్తోంది. ఎందుకంటే శంకర్ ఇప్పుడు మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. మీడియా కథనాల ప్రకారం ఆయన SU వెంకటేశన్ రాసిన వేల్పారి నవల ఆధారంగా ఒక చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. తాజా నివేదికల ప్రకారం.. ఈ చారిత్రాత్మక డ్రామా చిత్రం కోసం సౌత్ ఇండియన్ సినిమాలోని ఇద్దరు పెద్ద స్టార్స్ అయిన చియాన్ విక్రమ్, సూర్యలు నటించబోతున్నారు.
వీరిద్దరితో ఈ సినిమా తీయడానికి శంకర్ ప్లాన్ చేస్తున్నారట. ఈ వార్త ఇప్పుడు సినీ వర్గాలతో పాటు అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. ముగ్గురు స్టార్ల ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు వస్తున్నాయి. దీనిని గురించి ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ, అన్నీ కుదిరితే శంకర్‌తో విక్రమ్‌కి ఇది మూడో సినిమా అవుతుంది. ఇంతకుముందు వీరిద్దరూ 'అన్నియన్', 'ఐ' వంటి చిత్రాలను అందించారు.
మరోవైపు శంకర్‌తో సూర్యకి ఇదే మొదటి సినిమా. దాదాపు 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమా ద్వారా విక్రమ్, సూర్య కలిసి తెరపై కనిపించనున్నారు. గతంలో పితామగన్‌లో కలిసి నటించారు. ఈ చిత్రం 2003లో విడుదలైంది. ప్రస్తుతం, ఇద్దరు నటీనటుల ప్రకటన కోసం వారి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
శంకర్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం గేమ్ ఛేంజర్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇది డిసెంబర్ 20 న థియేటర్లలో విడుదల కానుంది. ఇది కాకుండా శంకర్ చేతిలో భారతీయుడు 3 కూడా ఉంది. నివేదికల ప్రకారం శంకర్ తన మిగిలిన అన్ని ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి అదనంగా మరో నాలుగు నెలల సమయం పడుతుందని అంచనా. ఇది పూర్తయిన వెంటనే వేల్పారి నవల ఆధారంగా సినిమా షూరూ చేయనున్నారు.
S. వెంకటేశన్ రచించిన వీరయుగ నాయకన్ వేల్పరి , తమిళ నవలలలో అత్యంత ప్రియమైన నవలలలో ఒకటి. శంకర్ దానిని స్వీకరించే హక్కులను ఇప్పటికే పొందారు. భారీ అంచనాలున్న ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. చాలా ఏళ్ల తర్వాత ఈ దిగ్గజాలు కలిపి మళ్లీ తెరపై చూడాలని అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.
శివ దర్శకత్వం వహించిన అత్యంత భారీ అంచనాలతో రాబోయే సూర్య చిత్రం కంగువ. సూర్య భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రం ఇది. దీని ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. సినీ వర్గాల్లో భారీ అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటానీ కూడా నటిస్తున్నారు. నవంబర్ 14, 2024న విడుదల కానుంది.
ఇందులో యాక్షన్-ఆధారిత పాత్రలో నటిస్తున్నారు సూర్య. 1,500 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలతో కంగువ తెరకెక్కుతోంది. నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు వంటి విభిన్న నటులు కూడా ఇందులో ఉన్నారు. స్టూడియో గ్రీన్ నిర్మించిన ఈ చిత్రం 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో.. దేశంలోని వివిధ ప్రదేశాలతో పాటు ఏడు దేశాల్లో చిత్రీకరించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
పా రంజిత్ దర్శకత్వం వహించిన తంగళన్ ఆగస్ట్ 15న విడుదలైంది. పశుపతి, అర్జున్ అన్బుదన్, డేనియల్ కాల్టాగిరోన్, పార్వతి తిరువోతు, హరి కృష్ణన్, ప్రీతి కరణ్‌లతో పాటు, విక్రమ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించారు. బ్రిటీష్ కాలంలో గిరిజన తెగతో ఉన్న సంబంధాలతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో మరోసారి అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు విక్రమ్.