సింగర్‌ కల్పన సూసైడ్‌ అటెంప్ట్ లో బిగ్‌ ట్విస్ట్.. అసలు నిజాలు బయటపెట్టిన సింగర్‌ కూతురు

Published : Mar 05, 2025, 01:55 PM ISTUpdated : Mar 05, 2025, 02:19 PM IST
సింగర్‌ కల్పన సూసైడ్‌ అటెంప్ట్ లో బిగ్‌ ట్విస్ట్.. అసలు నిజాలు బయటపెట్టిన సింగర్‌ కూతురు

సారాంశం

Singer Kalpana : స్టార్‌ సింగర్‌ కల్పన ఆత్మహత్యయత్నంలో బిగ్‌ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె సూసైడ్‌ అటెంప్ట్ చేయలేదని కల్పన కూతురు స్పందించింది. తాజాగా ఆమె ఆరోగ్యంపై కూతురు రియాక్ట్ అయ్యారు. 

Singer Kalpana : ప్రముఖ టాలీవుడ్‌ సింగర్‌ కల్పన ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసిన విషయం తెలిసిందే. మంగళవారం ఆమెని తన ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఆమెకి చికిత్స అందించారు. అయితే కల్పన సూసైడ్‌ అటెంప్ట్ చేసిందని అంతా భావించారు. నిద్ర మాత్రలు తీసుకుని ఆమె ఆత్మహత్యయత్నం చేసిందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. చెన్నైలో ఉన్న ఆమె భర్త ప్రసాద్‌ని కూడా పిలిపించి విచారించారు. ఈ విచారణలో తెలిసిన నిజాలేంటనేది పోలీసులు వెల్లడించాల్సి ఉంది. 

సింగర్‌ కల్పన ఆత్మహత్య చేసుకోలేదు, హై డోస్‌ టాబ్లెట్లే కారణంః కల్పన కూతురు దయా ప్రసాద్‌

ఇదిలా ఉంటే తాజాగా దీనిపై సింగర్‌ కల్పన కూతురు దయ ప్రసాద్‌ ప్రకర్‌ స్పందించింది. ఆమె ఆసుపత్రిలో తన తల్లిని పరామర్శించింది. దగ్గరుంచి చూసుకుంటుంది. ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడింది. అసలు జరిగింది ఏంటో వెల్లడించింది. కల్పన ఆత్మహత్యయత్నం చేయలేదని ఆమె స్పష్టం చేసింది. తను ఇన్సోమియా పేషెంట్‌ కావడంతో డాక్టర్ల సూచనల మేరకు ఆమె కొన్ని టాబ్లెట్లు తీసుకుంటుంది. అయితే వాటి డోస్‌ పెరగడంతో, హై డోస్‌ కారణం వల్ల తన తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లిందన్నారు. 

కల్పన ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు లేవని తేల్చిన కూతురు దయా ప్రసాద్‌

తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని ఆమె చెప్పింది. తాము అంతా సంతోషంగానే ఉన్నట్టు వెల్లడించారు. మమ్మి హెల్త్ విషయంలో తప్పుడు ప్రచారం చేయోద్దని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పింది. త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతుందని కల్పన కూతురు దయ ప్రసాద్‌ ప్రకర్‌ వెల్లడించారు. మొత్తంగా తమ ఫ్యామిలీలో గొడవలు లేవని, హై డోస్‌ టాబ్లెట్ల వల్లనే ఇదంతా జరిగిందని కూతురు తెలిపింది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 

నిలకడగా సింగర్‌ కల్పన ఆరోగ్యం.. రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్

ఇక కల్పన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందించారు. ప్రస్తుతం నిలకడగానే కల్పన ఆరోగ్యం ఉందని, అపస్మారక స్థితిలో ఆసుపత్రికి రావడంతో వెంటిలేటర్‌పై వైద్యం అందించినట్టు తెలిపారు. ఇప్పుడు వైద్యానికి సహకరిస్తుందని చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో కల్పన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆసుపత్రిలో కల్పన కదులుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టుగా తెలుస్తుంది.  

read more: Singer Kalpana: సింగర్ కల్పన భర్త ఎవరు ? ఏం చేస్తుంటారు ? ఫ్యామిలీ డిటెయిల్స్

also read: సింగర్‌ కల్పన ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది?.. ఇంటి గొడవలా? ఆమె భర్తనే కారణమా?
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Nagarjuna తో పోటీకి దిగి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్, ఇంతకీ ఆమూవీ ఏదో తెలుసా?
Savitri: మహానటి జీవితం నాశనం కావడానికి జెమినీ గణేషన్‌, పొలిటీషియన్‌ మాత్రమే కాదు, ఆ మూడో వ్యక్తి ఇతడేనా?