
చిన్మయి శ్రీపాద(Chinmayi Sripada)సీరియస్ ఫెమినిస్ట్. చాలా కాలంగా ఆమె లైంగిక వేధింపులు, మహిళల హక్కులపై పోరాడుతున్నారు. తమిళ స్టార్ రైటర్ వైరముత్తు పై ఆమె చాలా పెద్ద యుద్ధమే చేశారు. ఈ క్రమంలో ఆమె కెరీర్ కూడా పోగొట్టుకున్నారు. ఈమెకు సోషల్ మీడియాలో కూడా భారీ ఎత్తున శత్రువులు ఉన్నారు. ముఖ్యంగా కొందరు మగవాళ్ళు ఆమెను ట్రోల్ చేస్తూ ఉంటారు. కాగా ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని యాజమాన్యం సస్పెండ్ చేసింది. దానికి కారణం నిబంధలకు విరుద్ధంగా ఆమె పోస్ట్స్ ఉన్నాయని. నిజానికి ఆమెకు ఇంస్టాగ్రామ్ లో అసభ్యకర ఫోటోలు కొందరు డైరెక్ట్ మెసేజ్ చేస్తున్నారట.
ఇదే విషయాన్ని పిర్యాదు చేసినందుకు నా అకౌంట్ ఇంస్టాగ్రామ్ వాళ్ళు సస్పెండ్ చేశారు. నా బ్యాక్ అప్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఇదే అంటూ ఆమె ట్విట్టర్ పోస్ట్ పెట్టారు. మగవాళ్ళు తమ పురుషాంగాల ఫోటోలు పంపుతున్నారని చిన్మయి శ్రీపాద ఆ ట్వీట్ లో పొందుపరచడం కొసమెరుపు.
ఇక జూన్ 22న చిన్మయి కవలలు జన్మనిచ్చారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆమె ప్రసవించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. ఇక చిన్మయి భర్త ఎవరో కాదు నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్. అందాల రాక్షసి చిత్రంలో రాహుల్ హీరోగా నటించారు. ఇక ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిలసౌ జాతీయ అవార్డు గెలుచుకుంది. నాగార్జున హీరోగా మన్మథుడు 2 చిత్రాన్ని రాహల్ తెరకెక్కించారు. ఇది డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా విషయంలో రాహుల్ తో పాటు చిన్మయి కూడా విమర్శల పాలైంది. ఆ చిత్రంలోని శృతిమించిన శృంగార సన్నివేశాలను ఉద్దేశిస్తూ ముందు నీ భర్తకు బుద్ధి చెప్పు ఇలాంటి చిత్రాలు తీయకుండా అంటూ... ఆమెను తెగ ట్రోల్ చేశారు.