రన్బీర్ కపూర్ ‘షంషేరా’ తెలుగు ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టిన బాలీవుడ్ స్టార్..

Published : Jun 24, 2022, 06:08 PM IST
రన్బీర్ కపూర్ ‘షంషేరా’ తెలుగు ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టిన బాలీవుడ్ స్టార్..

సారాంశం

బాలీవుడ్ లవర్ బాయ్ రన్బీర్ కపూర్ మరో భారీ చిత్రం ‘షంషేరా’ను రిలీజ్ సిద్ధం చేశాడు. తాజాగా ఈ మూవీ తెలుగు వెర్షన్ ట్రైలర్ విడుదలైంది. అద్భుతమైన నటనతో రన్బీర్ కపూర్ ఆకట్టుకుంటున్నాడు.     

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం నడుస్తున్న  ట్రెండ్ పాన్ ఇండియా మూవీస్. యూనివర్సల్ కంటెంట్ ఏదైనా పాన్ ఇండియన్ ఫిల్మ్ గానే తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అన్ని ఇండస్ట్రీల దర్శక నిర్మాతలు. ఇప్పటికే బహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్ వంటి చిత్రాలు క్రియేట్ చేసిన సెన్సేషన్ తో పాన్ ఇండియన్ చిత్రాల ట్రెండ్  కొనసాగుతోంది. అటు బాలీవుడ్ స్టార్ కూడా సౌత్ లో పాగా వేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో బాలీవుడ్ లవర్ బాయ్ రన్బీర్ కపూర్ (Ranbir Kapoor) తన తదుపరి రెండు భారీ చిత్రాలను పాన్ ఇండియన్ ఫిల్మ్స్ గానే రిలీజ్ చేయనున్నారు. 

ఇప్పటికే బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ చిత్రం `బ్రహ్మాస్త్ర`(Brahmastra)ను రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ (Alia Bhatt) జంటగా నటించారు. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున (Nagarjuna), మౌనీ రాయ్‌ కూడా పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. కొద్ది రోజుల కిందనే ‘బ్రహ్మస్త్రం’ తెలుగు వెర్షన్ ట్రైలర్ విడుదలై ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. తాజాగా రన్బీర్ నటించిన మరో భారీ చిత్రం ‘షంషేరా’ (Shamshera) నుంచి కూడా తెలుగు వెర్షన్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

18వ శతాబ్దంలో బ్రిటిష్ వారిపై స్వతంత్రం కోసం పోరాడిన ఒక దొంగల జాతి కథగా ఈ మూవీ తెరకెక్కింది. షంషేరా అనే యోధుడిగా అలాగే దొంగగానూ రణబీర్ కనిపించనున్నట్లు ట్రైలర్ ని చూస్తే అర్ధం అవుతోంది. ముఖ్యంగా ట్రైలర్ లో రణబీర్ నటన, డైలాగ్స్, స్టైల్, భారీ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. సంజయ్ దత్ విలన్ గా ఆకట్టుకుంటున్నారు. ఈ మూవీకి మిథూన్ మ్యూజిక్ అందిందించారు. రన్బీర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ (Vaani Kapoor) నటించింది. యష్ రాజ్ ఫిల్మ్ నిర్మించిన ఈ భారీ చిత్రానికి కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించారు. జూలై 22న హిందీతో పాటు తెలుగు, తమిళంలో నూ రిలీజ్ చేయనున్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chennai Love Story Movie Review: చెన్నై లవ్‌ స్టోరీ మూవీ రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
Salman Khan: జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన.. సల్మాన్ ఖాన్ సపోర్ట్, అసలేం అన్నారంటే?