Balakrishna: బాలయ్యకు కరోనా... ఆందోళనలో ఫ్యాన్స్!

Published : Jun 24, 2022, 06:10 PM IST
Balakrishna: బాలయ్యకు కరోనా... ఆందోళనలో ఫ్యాన్స్!

సారాంశం

బాలకృష్ణ కరోనా బారినపడ్డారు. ఈ మేరకు ఆయన స్వయంగా తెలియజేశారు. గత రెండు రోజుల్లో తనని కలిసిన వాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవలసిందిగా కోరారు. 

హీరో బాలకృష్ణ (Balakrishna)కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన తెలియజేశారు. కొంచెం అనారోగ్య లక్షణాలు కనిపించడంతో బాలకృష్ణ ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా అని తెలిసింది. వెంటనే ఆయన ఐసొలేట్ కావడం జరిగింది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను బాగానే ఉన్నాను. గత రెండు మూడు రోజుల్లో నన్ను కలిసినవారు వైద్య పరీక్షలు చేయించుకోవాలి అంటూ ఆయన సూచించారు. 

ఇక బాలయ్యకు కరోనా (Corona Virus)సోకిందన్న విషయం తెలుసుకున్న అభిమానులు ఒకింత ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య దర్శకుడు గోపీచంద్ మలినేని చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. దసరా కానుకగా మూవీ విడుదల చేయాలని త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. బాలకృష్ణ 107వ చిత్రంగా ఇది తెరకెక్కుతుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. 

అలాగే ఆహా యాప్ లో అన్ స్టాపబుల్ టాక్ షో సీజన్ 2కి ఆయన సిద్ధం అవుతున్నారు. త్వరలో ప్రారంభం కానున్నట్లు మేకర్స్ ప్రకటించగా డైరెక్టర్ బి వి ఎస్ రవి టీం ఏర్పాట్లు చేస్తుంది. త్వరలో అన్ స్టాపబుల్ షూటింగ్ లో బాలయ్య పాల్గొనాల్సి ఉంది. బాలయ్య కోలుకున్న వెంటనే సీజన్ షో 2 ఎపిసోడ్స్ చిత్రీకరణ మొదలవుతుంది. ఇక బాలయ్య తన 108వ చిత్రం దర్శకుడు అనిల్ రావిపూడితో ప్రకటించారు. ఇదే ఏడాది ఆ చిత్రం కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు
Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే