
సిద్దు జొన్నలగడ్డ ఈ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సిద్థు అంటే అందరికి ముందుగా గుర్తు వచ్చే సినిమా డీజే టిల్లు. గుంటూర్ టాకీస్ తో ఓ రేంజ్ లో రొమాంటిక్ ఇమేజ్ సాధించిన ఈ కుర్ర హీరో.. డిజే టిల్లుతో ఎక్కడికో వెళ్లి కూర్చున్నాడు. విమల్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా..అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ మూడు రెట్లు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. యూత్ ను ఒక ఊపు ఊపిన ఈమూవీకి త్వరలో సీక్వెల్ రాబోతోంది.
డిజే టిల్లు మూవీకి పార్ట్ 2 కూడా వస్తుందని డైరెక్టర్ ఎప్పుడో చెప్పేశాడు. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. బాక్సాఫీస్ వద్ద షేక్ చేసింది ఈ మూవీ. డీజే టైటిల్ పాత్రలో సిద్దు జొన్నలగడ్డ క్యారెక్టర్ మాత్రం చాలా కొత్తగా కనిపించింది. అందరు హీరోల మాధిరి కాకుండా డిఫరెంట్ గా డిజైన్ చేశారు ఈ పాత్రను. హీరో బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ.. సిద్థు యాటిట్యూడ్ ఈ సినిమా సక్సెస్ కు రీజన్ గా చెప్పుకోవచ్చు.
అయితే ఈసారి డిజే టిల్లు సీక్వెల్ మాత్రం అంతకు మించి ఉండబోతున్నట్టు తెలుస్తోంది. డిజే టిల్లు పాత్రతో మరింత అద్భుతం చేయవచ్చు అని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. అందుకు తగ్గట్టుగానే డీజే టిల్లు 2 కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఆల్రెడీ ప్రారంభించినట్టు సమాచారం. డిజే టిల్లు మూవీ లో టిల్లుతో పాటుగా రాధిక పాత్ర చాలా కీలకం. రాధిక పాత్రలో నేహా శెట్టి అలరించింది. అయితే డీజే టిల్లు 2 లో ఈ అమ్మడు కనిపించే అవకాశం లేనట్టు తెలుస్తోంది.
డీజే టిల్లు సీక్వెల్ మూవీలో నేహా శెట్టి ప్లేస్ లో మరొక హీరోయిన్ ని తీసుకువస్తున్నారని తెలుస్తోంది. కేవలం అతిథి పాత్రలో మాత్రమే నేహా శెట్టి కనిపించనుందని సమాచారం.డీజే టిల్లు సీక్వెల్లో హీరో పాత్రతో పాటు హీరోయిన్ పాత్ర ప్రధాన మార్పు అని తెలుస్తోంది. మొదటి భాగంలోని కొన్ని పాత్రలు రెండో భాగంలో కూడా కొనసాగుతాయట. వీటితో పాటుగా మరికొన్ని కొత్త పాత్రలు కూడా వచ్చి చేరుతాయి. వీటిలో ముఖ్యంగా హీరోయిన్ పాత్ర మరీ ముఖ్యమైనది. దీనికోసం గ్లామరస్ హీరోయిన్ కావాలని వారు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఈ సినిమాను రూపొందిస్తోందని తెలుస్తోంది.