
మలయాళీ నటుడు శ్రీజిత్ రవి అసభ్యకర ప్రవర్తన బట్టబయలైంది. సోమవారం శ్రీజిత్ ని అరెస్ట్ చేసినట్లు కేరళ పోలీసులు ప్రకటించారు. శ్రీజిత్ మలయాళంలో ప్రముఖ నటుడిగా రాణిస్తున్నారు. సీనియర్ నటుడు టిజి రవి తనయుడే ఈ శ్రీజిత్.
ఇద్దరు స్కూల్ బాలికల పట్ల శ్రీజిత్ అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు పోక్సో చట్టం కింద అతడిని అరెస్ట్ చేశారు. త్రిసూర్ లోని ఓ పార్క్ వద్ద శ్రీజిత్ ఇద్దరు మైనర్ బాలికలతో అసభ్యకర చేష్టలు చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాడు. వారిలో ఒక బాలిక వయసు 9 ఏళ్ళు కాగా మరో బాలిక వయసు 14 ఏళ్ళు.
శ్రీజిత్ ఇలా అసభ్యంగా దిగజారుడు తనంతో ప్రవర్తించడం ఇదేమి కొత్త కాదు. 2016లో కూడా కొందరు స్కూల్ బాలికలతో శ్రీజిత్ అసభ్యంగా ప్రవర్తించి అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళి అదే తంతు. ఈ సారి పోలీసులు అతడిపై బలంగా చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
శ్రీజిత్ ఇద్దరు మైనర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలని సీసీటీవీ ఫుటేజ్ లో గమనించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీజిత్ రవి మలయాళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా పలు చిత్రాల్లో నటిస్తున్నాడు.
బాలికలతో అసభ్యంగా వర్తించిన శ్రీజిత్ రవి పట్ల మలయాళీ చిత్ర పరిశ్రమ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. సమాజంలో బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి ఇలా నీఛమైన పనులకు దిగజారడం ఏంటి అంటూ శ్రీజిత్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.