మ్యూజిక్ మాస్ట్రో కి సూపర్ స్టార్ స్పెషల్ విషెష్.. ఏమన్నారంటే..?

Published : Jul 07, 2022, 04:35 PM IST
మ్యూజిక్ మాస్ట్రో  కి సూపర్ స్టార్ స్పెషల్ విషెష్.. ఏమన్నారంటే..?

సారాంశం

ప్రపంచం మెచ్చిన మ్మూజిక్ డైరెక్టర్ ఇళయరాజాను ప్రత్యేకంగా అభినందించారు తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్.  ఇళయరాజాను అభినందిస్తూ.. స్పెషల్ గా ట్వీట్ చేశారు. 

మ్యూజిక్ మేస్ట్రో ఇళయ రాజాకు  స్పెషల్ గా అభినందనలు తెలిపారు సౌత్ సూపర్ స్టార్ రజనికాంత్. రీసెంట్ గా ఇండియన్ గవర్నమెంట్ ఇళయరాజాను ను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి కోటాలో తమిళనాడు నుంచి సంగీత చక్రవర్తిని రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. 

రాజ్యసభ సభ్యునిగా నియమితులైన తన ప్రియ మిత్రుడు, సంగీత విద్వాంసుడు ఇళయరాజా గారికి హృదయపూర్వక అభినందనలు అని రజనీ కాంత్ స్పెషల్ గా ట్వీట్ చేశారు. ఇళయరాజా, రజనీకాంత్ ల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. గత 28 ఏళ్లుగా వారి స్నేహం కొనసాగుతోంది. 

 

 

ఇక రాష్ట్రప‌తి కోటాలో  కొన్ని  రంగాల‌కు చెందిన న‌లుగురిని రాజ్యసభకు నామినేట్ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం నిర్ణంయం తీసుకుంది. అందులో తమిళనాడు నుంచి   ఇళయరాజాతో పాటుగా ఆంథ్రప్రదేశ్ నుంచి  ప్రముఖ సినీ కథా రచయిత, స్టార్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి  విజ‌యేంద్ర ప్ర‌సాద్‌ ఉన్నారు. అటు కేరళ నుంచి  ప‌రుగుల రాణి పీటీ ఉష‌ ఉండగా.. కర్ణాటక నుంచి  వీరేంద్ర హెగ్డేల‌ను ఎన్డీఏ స‌ర్కారు రాజ్య‌స‌భకు నామినేట్ చేసింది.

PREV
click me!

Recommended Stories

Demon Pavan Remuneration : 15 లక్షల జాక్ పాట్ తో పాటు, డిమాన్ పవన్ రెమ్యునరేషన్ టోటల్ గా ఎంతో తెలుసా?
Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ