నీ పేరేంటి?.. వైసీపీ మంత్రిపై నాని సెటైర్.. నాని గారూ అసలు తగ్గడం లేదుగా!

Published : Dec 28, 2021, 12:20 PM ISTUpdated : Dec 28, 2021, 12:26 PM IST
నీ పేరేంటి?.. వైసీపీ మంత్రిపై నాని సెటైర్.. నాని గారూ అసలు తగ్గడం లేదుగా!

సారాంశం

డిసెంబర్ 24న నాని శ్యామ్ సింగరాయ్ మూవీ విడుదలైంది. విడుదలకు ముందు రోజు మీడియా సమావేశంలో పాల్గొన్న నాని ఏపీలో అమలవుతున్న టికెట్స్ ధరలపై అసహనం వ్యక్తం చేశారు. 

సినిమాటోగ్రఫీ చట్టంలో ఏపీ ప్రభుత్వం మార్పులు చేయడం చిత్ర పరిశ్రమ పెద్దలకు మింగుడు పడడం లేదు. టికెట్స్ ధరల తగ్గింపు, బెనిఫిట్స్ షోస్ రద్దు, టికెట్స్ ఆన్లైన్ అమ్మకాలు వంటి ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో అమలవుతున్న సినిమా టికెట్స్ ధరలతో థియేటర్స్ నిర్వహణ సాధ్యం కాదని బడా హీరోలు, నిర్మాతల వాదన. ఇది చిత్ర పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తుందని, థియేటర్స్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థపై ఆధారపడి ఉన్న కార్మికులు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

డిసెంబర్ 24న నాని శ్యామ్ సింగరాయ్ మూవీ విడుదలైంది. విడుదలకు ముందు రోజు మీడియా సమావేశంలో పాల్గొన్న నాని ఏపీలో అమలవుతున్న టికెట్స్ ధరలపై అసహనం వ్యక్తం చేశారు. పది ఇరవై రూపాయలకు సినిమా టికెట్  అమ్మడం ప్రేక్షకులను అవమానించడమే అన్నారు. అలాగే టికెట్స్ ధరలు పెంచినా భరించగలిగిన స్తోమత ఆడియన్స్ కి ఉంది. ఓ సినిమా థియేటర్ కౌంటర్ కలెక్షన్స్ కిరాణా కొట్టు కలెక్షన్స్ కంటే తక్కువగా ఉంటున్నాయని సెటైర్స్ కూడా వేశారు.  

నాని వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వైసీపీ నాయకులు నాని వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. హీరో నాని ఎవరో నాకు తెలియదంటూ? ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ద్వారా సమస్య మరింత జటిలం చేయవద్దని బడా నిర్మాతల సూచన. చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం రాబట్టాలని సహనంగా ఎదురు చూస్తున్నారు. పరుష వ్యాఖ్యలు చేయవద్దని నాని లాంటి హీరోలకు కొందరు పెద్దలు సూచనలు చేస్తున్నారు. 

అయితే నాని మాత్రం తన ఆవేశం ఆపుకునేలా కనిపించడం లేదు. పరిశ్రమలో యూనిటీ లేదు, వకీల్ సాబ్ సినిమా విషయంలోనే అందరు హీరోలు కలుగజేసుకొని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదంటూ ఆవేశపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆయన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై సెటైర్ వేశారు. తాను ఎవరో తెలియదన్న అనిల్ యాదవ్ మాటలకు పరోక్ష సమాధానంగా ఓ ట్వీట్ చేశారు. 

నాని తన ట్వీట్ లో... 'నీ పేరేంటి?' అని కామెంట్ పెట్టారు. అలాగే శ్యామ్ సింగరాయ్ నుండి ఓ మాస్ ఫోజ్ షేర్ చేశారు. ఇక నాని ఉద్దేశం అర్థం చేసుకున్న వైసీపీ కార్యకర్తలు నెగిటివ్ కామెంట్స్ తో రిప్లై ఇస్తుంటే ఆయన ఫ్యాన్స్.. మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం నాని ట్వీట్ వైరల్ గా మారింది. 

Also readనాని వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఆయన పెయిన్‌తో అన్నారుః దిల్ రాజు చురకలు..

కాగా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన శ్యామ్ సింగరాయ్ పాజిటివ్ టాక్ అందుకుంది. ఓ డిఫరెంట్ సబ్జెక్టు తో ఈ మూవీని ఆయన ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించారు. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించారు. నాని డ్యూయల్ రోల్ చేసిన శ్యామ్ సింగరాయ్ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Release పై మరో బ్యాడ్‌ న్యూస్‌ చెప్పిన నిర్మాతలు.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే?
Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్