
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సూపర్ హిట్ టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే'. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారమవుతున్న ఈ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. ఇప్పటివరకు బ్రహ్మానందం, నాని, అనిల్ రావిపూడి, రాజమౌళి వంటి ఎందరో సెలబ్రిటీలు గెస్ట్ లుగా వచ్చారు. తాజాగా పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్ సైతం ఈ షోలో సందడి చేసారు. ఇందులో బన్నీతో పాటు రష్మిక మందన్నా, సుకుమార్ సైతం కనిపించారు. ఈ నేపధ్యంలో ఈ షో ప్రోమో వచ్చిన దగ్గర నుంచి ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇంతకీ ఈ ఎపిసోడ్ ఎలా ఉంది..ఎక్సపెక్టేషన్స్ రీచ్ అయ్యాయా అంటే లేదనే చెప్పాలి.
వాస్తవానికి ఈ ఎపిసోడ్ రెండు రోజులు ముందే శుక్రవారం ప్రసారం కావలసి ఉండగా, టెక్నికల్ రీజన్స్ తో ఆ ఎపిసోడ్ ఈరోజు, ఆదివారం ప్రసారం చేసారు. అయితే ఈ ఎపిసోడ్ మాత్రం చాలా డల్ గా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొదట బాలకృష్ణ ఈ షో కి దర్శకుడు సుకుమార్ ని ఆహ్వానించారు. సుక్కు తో బాలయ్య కాస్త ఫన్ చేసారు. ఆ తర్వాత హీరోయిన్ రష్మిక షో కి ఎంటర్ అయ్యింది. సుకుమార్ - రష్మిక తోనే ఎక్కువగా ఈ ఎపిసోడ్ సాగింది. ప్రోమో లో, ఫొటోస్ లో ఎంతో హైప్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ కేవలం ఎపిసోడ్ చివరలో వచ్చి కొద్ది నిముషాలు మాత్రమే కనిపించారు.
ఉన్న ఆ కొద్ది టైమ్ లో కూడా అల్లు అర్జున్, బాలకృష్ణ ఒకరికి ఒకరు థాంక్స్ చెప్పుకోడంతోటే సరిపెట్టారహు. అంతకు ముందు మిగతా సెలబ్రెటీలను చేసినట్టుగా అల్లు అర్జున్ ని కొంచెం ఇంటరెస్టింగ్ ప్రశ్నలు వేస్తె బాగుండేది. అయితే ఈ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కేవలం పుష్ప ప్రమోషన్ ఎపిసోడ్ గా ప్లాన్ చేసినట్లు ఉన్నారు. దాంతో అది అలా ముగిసింది. కావాలని ఈ ఎపిసోడ్ లెంగ్త్ తగ్గించేసారో లేక అలాగే చెయ్యాలని అనుకున్నారో కానీ ఈ ఎపిసోడ్ మాత్రం అనుకున్న స్దాయిలో లేదనే వినపడింది. అల్లు అర్జున్ ఎక్కువ సేపు కనపడి, బాలకృష్ణ తో మాట్లాడుతూంటే చూడాలని, వినాలని అనుకునే వాళ్ళకి ఈ ఎపిసోడ్ చాసాక నిరాశ ఎదురయ్యింది.
Also read NTR Political entry: రామయ్యా రాజకీయాల్లోకి రావయ్యా... ఎక్కడికెళ్లినా ఇదే నినాదం!
మరో ప్రక్క బన్నీని చూడగానే బాలయ్య కూడా పుష్పరాజ్‌లా మారిపోయాడు. అతడి స్టైల్‌లో నడుస్తూ.. 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైరూ! తగ్గేదేలే..' అని డైలాగ్ చెప్పి తొడగొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. అఖండ, పుష్ప కలిసి చేసిన హడావుడి చూడటానికి అభిమానులు ఎంతగానో ఎదురు చూసారన్నది నిజం. ఇక బాలయ్య హోస్టింగ్ చేయడమేంటి? అని విమర్శించినవాళ్లతోనే ఇదిరా హోస్టింగ్ అనిపించేలా చేశాడు ఎన్‌బీకే. ఫుల్ ఎనర్జీతో షోను సింగిల్ హ్యాండ్‌తో నడిపించడమే కాక ఎలాంటి ఈగోలు లేకుండా అందరు హీరోలను కలుపుకుపోతున్న బాలయ్య తీరుపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also read యాదాద్రి చరిత్రలో నిలిచిపోయే అద్భుతం.. సీఎం కేసీఆర్ కృషి ప్రశంసనీయం.. బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు